ETV Bharat / international

ఆఖరి క్షణంలో కాప్​26 లెక్కలు మార్చిన భారత్​.. అన్ని దేశాల బాగు కోరే... - పర్యావరణ పరిరక్షణ ఇన్ తెలుగు

శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా నిలిపివేయాలన్న నిబంధనను కాప్ సదస్సు వేదికగా వ్యతిరేకించి భారత్ తనకనుకూల ఫలితం రాబట్టింది. బొగ్గు వినియోగాన్ని నిలిపివేసే బదులు (Fossil fuels and Climate change) క్రమంగా తగ్గించుకోవాలన్న ప్రతిపాదనకు 200 దేశాలు ఆమోదం పలికాయి. దీనిపై పలు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. భారత్ ఈ ప్రతిపాదన (COP26 India) చేయడానికి గల కారణమేంటన్నది ఓ సారి పరిశీలిస్తే...

INDIA CLIMATE ACTION
INDIA at cop26
author img

By

Published : Nov 14, 2021, 2:18 PM IST

బొగ్గు, శిలాజ ఇంధనాల వినియోగం విషయంలో భారత్ చేసిన ప్రతిపాదనపై చర్చ అనంతరం కాప్26 వాతావరణ సదస్సు (COP26 Climate Summit) విజయవంతంగా ముగిసింది. తుది ఒప్పందంపై 200 దేశాలు ఆమోదముద్ర వేశాయి. శిలాజ ఇంధనాల వాడకాన్ని దశలవారీగా నిలిపివేయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ భారత్ కీలక ప్రతిపాదన చేసింది. బొగ్గు, శిలాజ ఇంధనాలను దశలవారీగా తగ్గించుకోవాలని ప్రతిపాదించింది. చివరి నిమిషంలో చేసిన ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు షెడ్యూల్ సమయం (COP26 Climate Change Conference) కంటే అదనంగా ఒకరోజు ప్రపంచ దేశాలు భేటీ అయ్యాయి.

భారత్ చేసిన ప్రతిపాదనలపై (COP26 India) పలు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. చర్చ అనంతరం ప్రతిపాదనను గుర్తిస్తూ.. ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే, బొగ్గు వాడకంపై భారత్ ఈ ప్రతిపాదన చేయడానికి గల కారణమేంటన్న విషయాలను ఓసారి పరిశీలిస్తే...

భారత్​ను నడిపేది శిలాజ ఇంధనాలే..

భారత్ ప్రతిపాదనకు ముందు కాప్26 ఒప్పంద పత్రంలో బొగ్గు, శిలాజ ఇంధనాల వాడకాన్ని 'దశలవారీగా నిలిపివేయాలి' అని పేర్కొన్నారు. దీని వల్ల రానున్న కొద్ది సంవత్సరాల్లో శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. భారత్​ ఇంధన అవసరాల్లో 55 శాతం బొగ్గు (India fossil fuel consumption) నుంచే తీరుతోంది. పెట్రోలియం, సహజ వనరులను కలుపుకుంటే.. భారత అవసరాల్లో 73.58 శాతం శిలాజ ఇంధనాలే (India Fossil Fuels) తీరుస్తాయి.

దేశంలోని పరిశ్రమలు చాలా వరకు బొగ్గు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్​పైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. దీంతోపాటు ఎల్​పీజీ, కిరోసిన్, రవాణాకు ఉపయోగించే ఇంధనాలు వంటివన్నీ శిలాజ ఇంధనాలే. వీటిని సమీప భవిష్యత్​లో గణనీయంగా తగ్గించాల్సి వస్తే.. ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా నష్టం కలుగుతుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల రంగంలో (Renewable Energy in india) భారత్ ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తోంది. వాటిని దేశ అవసరాలు తీర్చేలా బలోపేతం చేయకముందే.. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తే ప్రతికూల ప్రభావం పడుతుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం..

భారత్​లోనే కాకుండా చైనా సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ పరిస్థితి ఇదే. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాల తరఫున మాట్లాడే భారత్.. కాప్ సదస్సులో ఈమేరకు బొగ్గు వాడకాన్ని నిలిపివేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించింది. అభివృద్ధి, పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టిసారించే అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాలను తగ్గించుకోవడం మంచిది కాదని స్పష్టం చేసింది.

కాప్ సదస్సులో భారత్ తరపు హాజరైన పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కీలక అంశాలను లేవనెత్తారు. అవేంటంటే..

  • అభివృద్ధి అజెండాలతో పాటు పేదరిక నిర్మూలనపై అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పటికీ పోరాడుతున్నాయి. ఇలాంటి సమయంలో బొగ్గు వాడకాన్ని నిలిపివేస్తామని ఈ దేశాలు ఎలా హామీలు ఇవ్వగలుగుతాయి?
  • ధనిక దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితులు వేరు. కాబట్టి ఈ నిబంధన సమంజసం కాదు.
  • వాతావరణ లక్ష్యాలను అందుకోవడంలో ఆర్థిక సహకారంపై (COP26 Climate Finance) సమతుల్యత లోపించింది. పేద దేశాలకు సరైన నిధులు అందడం లేదు.
  • గ్లోబల్ కార్బన్ బడ్జెట్​ నుంచి తమ న్యాయమైన వాటాను పొందే హక్కు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉంది.
  • ప్రపంచంలోని కొన్ని దేశాలు భారీగా సంపదను సృష్టించుకునేందుకు శిలాజ ఇంధనాలు ఉపయోగపడ్డాయి. ఈ నేపథ్యంలో పరిమితులకు లోబడి శిలాజ ఇంధనాలను బాధ్యతాయుతంగా వినియోగించుకునే అర్హత ఈ దేశాలకు ఉంది.

నిలకడలేని జీవనశైలి, వినియోగ పద్ధతుల వల్ల భూతాప సమస్యలు తలెత్తుతున్నాయని వాతావరణ సదస్సులో భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. పారిస్ వాతావరణ ఒప్పందంలో పేర్కొన్నట్టుగా పర్యావరణ స్నేహపూర్వక జీవన విధానాలు, వాతావరణ నిస్పాక్షికత ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పారు.

చైనా మద్దతు!

చైనా సైతం బొగ్గు వాడకాన్ని నిలిపివేయాలన్న నిబంధనను వ్యతిరేకించింది. భారత్ చేసిన ఈ ప్రతిపాదనకు దక్షిణాఫ్రికా మద్దతు పలికింది. శిలాజ ఇంధనాలను నిలిపివేయాలన్న నిబంధనకు వ్యతిరేకంగా ఇరాన్, నైజీరియా సైతం భారత్​కు మద్దతుగా నిలిచాయి.

బొగ్గు, శిలాజ ఇంధనాల వాడకం ఎందుకు తగ్గించాలంటే?

పర్యావరణ మార్పులకు బొగ్గు, శిలాజ ఇంధనాలే (Fossil fuels and Climate change) ప్రధాన కారణం. ఉష్ణోగ్రతలు, వాతావరణ తీరుతెన్నుల్లో మార్పులు సాధారణంగానే సంభవిస్తుంటాయి. అయితే, పారిశ్రామిక విప్లవం తర్వాత మానవ కార్యకలాపాలే.. వాతావరణ మార్పులకు ఆజ్యం పోస్తున్నాయి. శిలాజ ఇంధనాలు (బొగ్గు, ఆయిల్, గ్యాస్) మండించడం వల్ల.. గ్రీన్​హౌజ్ ఉద్గారాలు వెలువడుతాయి. ఇవి భూతాపాన్ని పెంచుతాయి. భూతాపం పెరిగితే అనేక విపత్తులు, సంక్షోభాలు సంభవిస్తాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.