వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్ ప్రముఖ 'పీస్ టీవీ' నెట్‌వర్క్‌పై భారీ జరిమానా విధించింది బ్రిటన్ మీడియా వాచ్డాగ్ ఆఫ్కామ్. విద్వేషపూరిత ప్రసంగం, అభ్యంతరకరమైన వార్తలను ప్రసారం చేసిందుకు 3లక్షల పౌండ్లు(రూ. 2.75కోట్లు) అపరాద రుసుము చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రసార నియమాలను ఉల్లఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
పీస్ టీవీ ఉర్దూ ప్రసారం చేసే కార్యక్రమంలో ద్వేషపూరిత ప్రసంగం, అభ్యంతరకరమైన విషయాలు ఉన్నట్లు మా పరిశోధనల్లో తెలిసింది. ఇలాంటి ప్రసారాలు.. ఇతరులను నేరాలకు పాల్పడేలా ప్రేరేపించే అవకాశం ఉంది.
ఆఫ్కామ్.
లార్డ్ ప్రొడక్షన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పీస్ టీవీ ప్రసారం అవుతోంది. క్లబ్ టీవీ దీని లైసెన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండింటికీ నాయక్ నిర్వహణలో ఉన్న యూనివర్సల్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మాతృ సంస్థగా వ్యవహరిస్తోంది.
ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ...
పీస్ టీవీ లాభపేక్షలేని శాటిలైట్ టెలివిజన్ నెట్వర్క్. దుబాయ్ ప్రధాన కార్యాలయం నుంచి ఇంగ్లీష్, బెంగాలీ, ఉర్దూ, బాషల్లో ఉచిత కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. గతంలో నాయక్ భారత్‌లో మనీలాండరింగ్, ద్వేష పూరిత ప్రసంగాల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత 2016లో భారత్‌ను విడిచిపెట్టి మలేషియా వెళ్లాడు. అక్కడే శాస్వత నివాసం ఏర్పారుచుకున్నాడు.