ETV Bharat / international

ఒక్క మాట మాట్లాడకుండానే.. 100 మిలియన్ల ఫాలోవర్లు! - who is khaby lame

టిక్​టాక్​లో అనతికాలంలోనే 100 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుని సంచలనం సృష్టించాడు ఖాబీ లేమ్​. వంద మిలియన్ల ఫాలోవర్లు కలిగిన రెండో వ్యక్తిగా రికార్డుకెక్కాడు. ఒక్క మాట మాట్లాడకుండా.. కేవలం తన హావభావాలతో కోట్ల మందిని ఆకట్టుకుంటున్నాడు. 21 ఏళ్ల అతనికి ఈ స్థాయిలోఆదరణ లభించడానికి కారణమేంటంటే..

KHABY LAME
ఖాబీ లేమ్
author img

By

Published : Aug 23, 2021, 4:10 PM IST

ఇటలీకి చెందిన యువ టిక్​టాక్ సంచలనం ఖాబీ లేమ్.. అరుదైన ఘనత సాధించాడు. టిక్​టాక్​లో 100 మిలియన్ల ఫాలోవర్లు సంపాదించిన రెండో వ్యక్తిగా రికార్డుకెక్కాడు.

ఇటలీలో నివాసముండే 21 ఏళ్ల ఖాబానీ లేమ్​ అలియాస్ ఖాబీ లేమ్​.. అతి తక్కువ సమయంలోనే టిక్​టాక్​లో విశేష ఆదరణ దక్కించుకున్నాడు. అత్యధిక ఫాలోవర్లు గల సెలబ్రిటీగా అవతరించి సంచలనం సృష్టించాడు. జూన్​లో 65 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఖాబీకి ఇప్పుడు 105 మిలియన్లకుపైగా అభిమానులున్నారు. త్వరలోనే తను 122 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న చార్లీ డి అమెలియోను అధిగమించి నంబర్-1 స్టార్​గా అవతరిస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

KHABY LAME
ఓ వీడియోలో ఇలా...

ఎందుకింత ఆదరణ..

ఆఫ్రికా దేశం సెనెగలీస్​కు చెందిన ఖాబీ ప్రస్తుతం ఇటలీలో ఉంటున్నాడు. వీడియోలలో మాట్లాడకున్నా.. తన ప్రత్యేక హావభావాలు, చేష్టలతో టిక్​టాక్​లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ఖాబీ చేసే చిన్న చిన్న స్కిట్లు, కొన్ని క్లిష్టమైన వీడియోలపై ఆయన వ్యంగ్యంగా స్పందించే విధానం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన కామెడీ చూసినవారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. దీంతో కొద్ది నెలల్లోనే ఆయనను అనసరించే వారి సంఖ్య కోట్లలో పెరిగింది.

ఖాబీ కొద్ది నెలల క్రితం ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. కరోనా లాక్​డౌన్ కారణంగా ఆయన ఉద్యోగం పోయింది. దీంతో టిక్​టాక్​ వీడియోలపైనే ఎక్కువ దృష్టి సారించి.. మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇదీ చదవండి: భారత్​లో టిక్​టాక్ రీఎంట్రీ.. చిన్న మార్పుతో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.