ETV Bharat / international

ప్రమాదకర వేరియంట్లూ తల వంచాల్సిందే!

author img

By

Published : Jul 30, 2021, 5:13 AM IST

Updated : Jul 30, 2021, 7:42 AM IST

మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు శక్తిమంతమైన యాంటీబాడీలను రూపొందించారు జర్మనీ శాస్త్రవేత్తలు. అల్పకా జంతువుల రక్తం ద్వారా వీటిని అభివృద్ధిపరిచారు. అత్యంత ప్రమాదకర కరోనా వేరియంట్లను కూడా ఇవి సమర్థంగా అడ్డుకోగలవు అంటున్నారు పరిశోధకులు.

antibodies from alpacas, mini antibodies
ప్రమాదకర వేరియంట్లూ తల వంచాల్సిందే

కరోనా మహమ్మారిని మరింత సమర్థంగా అడ్డుకునేందుకు... నిలకడగా ఉండే శక్తిమంతమైన మినీ యాంటీబాడీలను జర్మనీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. దక్షిణ అమెరికాలో ఉండే ఒంటె జాతికి చెందిన అల్పకా జంతువుల రక్తం ద్వారా వీటిని అభివృద్ధిపరిచారు. అత్యంత ప్రమాదకర కరోనా వేరియంట్లను కూడా ఇవి సమర్థంగా అడ్డుకోగలవని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గొటింజెన్‌లోని యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్​, మ్యాక్స్‌ ప్లాంక్​ ఇన్సిట్యూట్‌ ఫర్‌ బయోఫిజికల్‌ కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు సాగించిన ఈ పరిశోధన వివరాలను 'ఈఎంబీవో' పత్రిక అందించింది.

"మేము రూపొందించిన సూక్ష్మ ప్రతినిరోధకాలు.. ప్రస్తుత యాంటీబాడీల కంటే వెయ్యి రెట్ల శక్తితో వైరస్‌ను బంధించి, బలహీనపరుస్తాయి. 95 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని, సమర్ధంగా పనిచేయగలవు. కొవిడ్‌ను అడ్డుకునే బౌషధానికి అవసరమైన లక్షణాలన్నీ వీటికి ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్దా వేరియంట్ల కరోనా స్పైక్​ ప్రొటీన్‌ను ఇవి అత్యంత సమర్థంగా అడ్డుకుంటాయని గుర్తించాం. త్వరలోనే ప్రయోగ పరీక్షలు చేపడతాం.

-డిర్క్‌ గోర్లిచ్‌, పరిశోధనకర్త

సూక్ష్మ ప్రతిరోధకాల ఉత్పత్తికి అయ్యే ఖర్చు కూడా తక్కువే కాబట్టి.. ప్రపంచ వ్యాప్తంగా సమర్థవంతమైన కొవిడ్‌ చికిత్సలను అందించే వీలుంటుందని గ్లోరిచ్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి : టీకా తీసుకున్నా మళ్లీ కరోనా.. ఎందుకిలా?

Last Updated : Jul 30, 2021, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.