ETV Bharat / international

లవ్​ సాక్ష్యం: ప్రేయసి కట్టించిన గుడి​ ఎక్కడుందో తెలుసా? - థార్న్‌వుడ్ క్యాజిల్ తెలుగు

మనిషి పుట్టుకకు అంతం ఉంది కానీ ప్రేమకు మాత్రం అంతం లేదు. తరాలు మారినా, యుగాలు అంతరించినా.. సృష్టి ఆరంభానికి మూలమైన ప్రేమ మాత్రం ఈ సృష్టిని ఏ కాలంలోనూ విడిచిపోలేదు. అందుకే కొందరి ప్రేమలు కాలాలకు అతీతంగా గుర్తుండిపోతాయి. తాము ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణత్యాగం చేసి కొందరు చరిత్రలో నిలిస్తే, మరి కొందరు తాము ప్రేమించిన వారి జ్ఞాపకాలను చిరకాలం భద్రపరుచుకునేందుకు అందమైన కట్టడాలకు శ్రీకారం చుట్టారు. అలా చరిత్రకెక్కిన కొన్ని ప్రేమ కట్టడాల గురించి తెలుసుకుందాం...

Popular symbolic love monuments in the world, list of six here with pics
ప్రేమికుడికి గుర్తుగా టెంపుల్​ కట్టిన ప్రేయసి
author img

By

Published : Aug 9, 2020, 10:21 AM IST

ప్రేమకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కట్టడాలు ఉన్నాయి. వాటిలో తాజ్​మహల్​ ఎనలేదని. అయితే ఇప్పటివరకు ప్రియుడు.. తన ప్రియురాలికి గుర్తుగా కట్టించిన సాక్ష్యాల గురించే తెలుసు. కానీ ఓ భార్య తన భర్త కోసం గుడి కట్టింది. అది ఎక్కడ ఉంది? అక్కడ ఏం చేస్తారు? తెలుసుకోవాలంటే ఇది చదవండి...

తాజ్‌మహల్:​ భార్య చివరి కోరిక తీర్చేందుకు..

భూమిపై ఉన్న అత్యంత అద్భుతమైన కట్టడాలలో తాజ్‌మహల్ ఒకటి. ఆగ్రా పట్టణంలో యమునా నది తీరాన అమర ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న తాజ్‌మహల్ వెనుక గుండెను మెలిపెట్టే ప్రేమకథ దాగి ఉంది. షాజహాన్ ప్రియసఖి, భార్య ముంతాజ్ చనిపోతూ చివరి క్షణంలో భర్తను ఒక కోరిక కోరింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ చూడని సమాధిని తనకోసం నిర్మించమని అడిగింది. భార్య కోరిక మేరకు షాజహాన్ తాజ్‌మహల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.

Popular symbolic love monuments
తాజ్‌మహల్

తాజ్‌మహల్‌ను 1631లో ప్రారంభించి 1653 వరకు.. అంటే 22ఏళ్ల పాటు దాదాపు 20వేల మంది కూలీలు నిర్మించారు. ప్రధాన సమాధి 1648లో పూర్తవగా ఆ తరువాత చుట్టుపక్కల భవనాలు, ఉద్యానవనం నిర్మించడానికి ఐదేళ్లు పట్టాయి. నాలుగు దిక్కుల నుంచి ఒకేలా కనిపించే ఈ కట్టడానికి ఇటలీ, పర్షియా కళాకారులు నిర్మాణ ఆకృతిని తయారు చేశారు. సృష్టిలో ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించే తాజ్‌మహల్ ఈ భూమిపై ఉన్న కట్టడాలన్నిటిలో అందమైనదని చెప్పడంలో సందేహం లేదు.

చందోర్ గార్డెన్​: కొండప్రాతాన్ని అందమైన తోటగా..

అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న చందోర్ గార్డెన్ ప్రముఖ చిత్రకారుడైన 'డగ్లస్ చందోర్', అతని భార్య 'ఇనా క్యుట్‌మన్' ప్రేమకు నిదర్శనం. 1926లో అమెరికా వచ్చిన డాగ్లస్ చందోర్ అతి తక్కువ కాలంలోనే ప్రముఖ చిత్రకారుడిగా ప్రసిద్ధి చెందాడు. క్యుట్‌మన్‌తో తనకు ఏర్పడిన పరిచయాన్ని 1930లో వివాహ బంధంతో ముడివేశాడు.

Popular symbolic love monuments
చందోర్ గార్డెన్

1936 నుంచి 16 ఏళ్ల పాటు వీరిద్దరూ కష్టపడి టెక్సాస్‌లోని అతి భయంకరమైన కొండప్రాంతాన్ని అత్యంత సుందరమైన తోటగా మార్చేసి, అందులోనే జీవించేవారు. 1953లో చందోర్, 1978లో క్యుట్‌మన్ మరణించాక.. వీరి ప్రేమకు గుర్తుగా మిగిలిపోయిన చందోర్ గార్డెన్ ప్రస్తుతం పెళ్లిళ్లకు వేదికగా మారింది.

మిరాబెల్ ప్యాలెస్​: ప్రేయసి అభిరుచికి తగ్గట్టు..

ఆస్ట్రియాలోని మిరాబెల్ ప్యాలెస్‌ను 1606లో 'ఆర్చ్‌బిషప్ వోల్ఫ్' అనే రాకుమారుడు తన ప్రేయసి 'సాలోమ్ ఆల్ట్' కోసం కట్టించాడు. ప్రియురాలి అభిరుచికి తగ్గట్టు ఆర్చ్‌బిషప్ ప్యాలస్‌లోని ప్రతి శిల్పాన్ని, గదిని అలంకరించాడు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చుకున్న వీరికి 15 మంది సంతానం. వీరిద్దరి మరణం తరువాత ఈ ప్యాలెస్ బయటి గోడలకు అనేక మార్పులు చేశారు కానీ లోపల ఉన్న శిల్పాలను, పురాతన కళాఖండాల అందాలను మాత్రం ఇప్పటి వరకు మార్చలేదు. పర్యటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మిరాబెల్ ప్యాలెస్.. ప్రపంచంలోని అమర ప్రేమికుల కట్టడాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

Popular symbolic love monuments
మిరాబెల్ ప్యాలెస్

కొడైజీ టెంపుల్​: భర్త మరణాన్ని తట్టుకోలేక..

ఇప్పటి వరకు ప్రేమికుడు ప్రేయసి కోసం కట్టించిన కట్టడాల గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రేయసి తన ప్రియుడి జ్ఞాపకంగా కట్టించిన కొడైజీ టెంపుల్ గురించి తెలుసుకుందాం. జపాన్‌లోని క్యోటో నగరంలో ఉన్న ఈ కట్టడాన్ని 'కీటా' అనే మహిళ.. తన భర్త టోయోటొమి జ్ఞాపకార్థం 1606లో కట్టించింది.

Popular symbolic love monuments
కొడైజీ టెంపుల్

భర్త మరణాన్ని తట్టుకోలేని కీటా అతని సమాధిని అందమైన కట్టడంగా మలచి, తన మరణానంతరం తన సమాధిని కూడా తన భర్త సమాధి పక్కనే కట్టమని కోరింది. ఆమె కోరిక ప్రకారం ఇప్పుడా మందిరంలో ఇద్దరి సమాధులు పక్కపక్కనే ఉంటాయి. రోజూ అనేకమంది పర్యటకులు కొడైజీ టెంపుల్‌ను సందర్శించి కీటా, టోయోటొమి ప్రేమకథను తెలుసుకుంటున్నారు.

థార్న్‌వుడ్ క్యాజిల్: ఇంగ్లండ్ నుంచి ఇటుకలు తెప్పించి..

వాషింగ్టన్‌లోని లేక్‌వుడ్ నగరంలో నాలుగెకరాల స్థలంలో విస్తరించి ఉన్న థార్న్‌వుడ్ కోట 'చెస్టర్ థార్న్', 'యానా' దంపతుల స్వచ్ఛమైన ప్రేమకు గుర్తు. 1907లో యానా తనకు కోటలో నివసించాలని కోరికగా ఉందని భర్త చెస్టర్ థార్న్‌కు చెప్పింది. ధనవంతుడైన థార్న్ తన ప్రియమైన భార్య కోరిక మేరకు ఇంగ్లండ్ ఎలిజబెత్ కాలంనాటి పురాతన భవనాన్ని కొనుగోలు చేశాడు.

Popular symbolic love monuments
థార్న్‌వుడ్ క్యాజిల్

ఆ భవనాన్ని పూర్తిగా పడగొట్టి ఒక్క ఇటుక కూడా వదలకుండా వాటిని మూడు ఓడల్లో ఇంగ్లండ్ నుంచి వాషింగ్టన్ తెప్పించాడు. ఆ ఇటుకలతో యానా కోరినట్లుగా 1908లో కోట నిర్మాణాన్ని ప్రారంభించి 1911లో పూర్తిచేశాడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వాస్తుశిల్పి 'కర్ట్‌ల్యాండ్ కెల్సీ' ఈ కోటకు ఆకృతి, శిల్ప కళను సమకూర్చాడు. ప్రస్తుతం ఈ కోటలోని గదులు పర్యటకులకు ఆతిథ్యం ఇస్తున్నాయి.

కోరల్ క్యాజిల్​: చెదిరిపోయిన ప్రేమకు నిదర్శనం

ఫ్లోరిడాలోని మియామి నగరంలో ఉన్న కోరల్ క్యాసిల్ చెదిరిపోయిన ప్రేమకు నిదర్శనం. 26 ఏళ్ల 'ఎడ్వర్డ్', 16ఏళ్ల 'ఆగ్నస్' అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరికీ పెళ్లి ముహూర్తం కూడా కుదిరాక ఆగ్నస్ పెళ్లికి ఒక్క రోజు ముందు ఎడ్వర్డ్‌తో తన వివాహాన్ని రద్దు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎడ్వర్డ్, ఓడిపోయిన తన ప్రేమకు గుర్తుగా ఒక కోటను నిర్మించాలని నిశ్చయించుకున్నాడు.

Popular symbolic love monuments
కోరల్ క్యాజిల్

1100 టన్నుల రాతిని కొద్దికొద్దిగా పేర్చి అర్ధ చంద్రాకారంలో అందమైన రాతి కట్టడాలను ప్రారంభించి, మరణించే వరకు కేవలం ఇదే పనిలో ఉన్నాడు. ప్రతి శిల్పం, స్తంభంపై అతని పేరు కూడా చెక్కుకున్నాడు ఎడ్వర్డ్. కేవలం ఒక్కడే ఇంత అందమైన కోటను పూర్తి చేశాడంటే అతనిలో ప్రేయసి జ్ఞాపకాలు ఎంత లోతుగా పాతుకున్నాయోనని పర్యటకులు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.