జీ-20 సదస్సు(Modi G20 summit) కోసం ఇటలీ(Modi visit to Italy) వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి పర్యటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఆదివారం.. జీ-20 సదస్సు రెండో రోజులో భాగంగా రోమ్‌లోని ప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెయిన్‌కు(Trevi fountain) వెళ్లారు.
ఇతర దేశాధినేతలు, అక్కడి అధికారులతో మోదీ కాసేపు కలియతిరిగారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్‌తో మోదీ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.
నీటిలోకి నాణెం..
ఆ తర్వాత వెనుకకు తిరిగి నీటిలోకి నాణెం (Trevi fountain coins) విసిరారు మోదీ. అలా భుజం మీదుగా నీళ్లలో నాణెం విసిరితే మళ్లీ రోమ్ వెళ్తారని ప్రజల నమ్మకం (Trevi fountain facts). భారత ప్రధాని కూడా ఇతర నేతలతో కలిసి ఇదే పని చేశారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫౌంటెయిన్లలో ట్రెవీ (Rome fountain famous) ముందు వరుసలో ఉంటుంది. చక్కటి శిల్పకళా నైపుణ్యం (Modi visit to Italy) దీని సొంతం.
జీ-20 సదస్సులో భాగంగా భారత ప్రధాని.. సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌లతో భేటీ అయ్యారు. అంతకుముందు.. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. ఆయనను భారత్‌కు రావాలని ఆహ్వానించారు మోదీ.
ఇవీ చూడండి: Cop26 Glasgow: వాతావరణ మార్పులపై 'కాప్' అస్త్రం ఫలిస్తుందా?
G20 Summit 2021: అగ్రదేశాధినేతలతో మోదీ మాటామంతీ.. బైడెన్‌తో సరదాగా..