ETV Bharat / international

Pandora papers leak: పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా లండన్!​ - పాండోరా పేవర్స్​ లేటెస్ట్​ న్యూస్​

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టును పాండోరా పేపర్స్​ (Pandora Papers Leak) రట్టు చేసిన నేపథ్యంలో.. ఎగవేతదారులకు లండన్​ స్వర్గధామంగా మారినట్లు తెలుస్తోంది. పన్నుమినహాయింపుల పేరుతో అత్యంత ధనవంతులకు, శక్తిమంతులకు ఇది ప్రధాన కేంద్రమైనట్లు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ యూకే ఆరోపించింది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్​, పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా దేశ రక్షణను మరింత కఠినతరం చేయాలని కొందరు న్యాయవాదులు బ్రిటన్​ను కోరుతున్నారు.

Pandora papers
పాండోరా పేపర్స్, లండన్
author img

By

Published : Oct 5, 2021, 6:53 PM IST

ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, శక్తిమంతులైన వ్యక్తులు.. వారి నగదును దాచుకోవడానికి లండన్​ను కేంద్రంగా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విడుదలైన పాండోరా పేపర్స్​ను (Pandora Papers Leak) పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. దీంతో అక్కడి న్యాయవాదులు కొందరు మనీలాండరింగ్​, పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా దేశ రక్షణను మరింత కఠినతరం చేయాలని బ్రిటన్​ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

జోర్డాన్​ కింగ్​ అబ్దుల్లా II, అజర్​బైజాన్​ అధ్యక్షుడు ఇల్హామ్​ అలీయేవ్​ సహా పాకిస్థాన్​ ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు కూడా పాండోరా పేపర్స్​ బయటపెట్టిన పన్నుఎగవేతదారుల జాబితాలో ఉన్నారు. అయితే బ్రిటీష్​ చట్టం ప్రకారం అవన్నీ చట్టబద్ధమైనప్పటికీ.. వీటిని ఆసరాగా చేసుకొని వారు పన్నుఎగవేతకు పాల్పడుతున్నట్లు న్యాయవాదులు చెప్తున్నారు. ఇదే క్రమంలో చాలామంది బ్రిటీష్​ ప్రజలు తమ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆరోపించారు.

ఎగవేతదారులకు స్వర్గధామం..!

మెరుగైన సాంకేతికత, విస్తృతమైన అవకాశాలకు లండన్​ కేంద్ర బిందువుగా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న వివిధ రకాలైన సంస్థలు.. ప్రపంచంలో ఉండే ధనవంతులను, శక్తిమంతమైన వ్యక్తులను ఆకర్షిస్తున్నాయి. గ్లోబల్​ విట్​నెస్​ అనే సంస్థ నివేదిక ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్​లోని దాదాపు 87,000 ఆస్తులు పన్ను ఎగవేత కోసం సృష్టించిన వివిధ రకాలైన కంపెనీలకు చెందినవని 2019లోనే పేర్కొంది. వీటిలో దాదాపు 40 శాతం కంపెనీలు ఒక్క లండన్​లోనే ఉన్నాయని తెలిపింది. వీటి మొత్తం విలువ 135 బిలియన్​ డాలర్లు కంటే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇవన్నీ యూకే పార్లమెంట్​కు అతి సమీపంలో ఉండే విలువైన ప్రాంతాల్లో ఉండడం గమనార్హం. అంతేగాకుండా లండన్​ నడిబొడ్డున ఉన్న అనేక ఆస్తులు విదేశీయులవే కావడం చర్చకు దారితీస్తుంది.

పన్ను మినహాయింపుల పేరుతో..

కొన్ని దశాబ్దాలుగా.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి యూకే ప్రభుత్వం పన్ను మినహాయింపులను తీసుకొచ్చింది. ఇది పన్ను ఎగవేతదారులను ఆకర్షించే ఆయస్కాంతంలా పని చేస్తోందని విమర్శకులంటున్నారు. ఇది చట్టబద్ధమైనదైనా.. మనీ లాండరింగ్​, పలు ఆర్థిక నేరాలకు ఆజ్యం పోస్తున్నట్లు చెప్తున్నారు.

"పాండోరా పేపర్స్​ (Pandora Papers Leak) బట్టబయలు చేసిన ఆస్తుల వివరాలు లండన్​ ప్రభుత్వానికి ఓ మేలుకొల్పు లాంటివి. ఇప్పటికైనా ఏళ్ల తరబడి వస్తున్న చట్టాలను మార్చి.. దేశ రక్షణకు పాటుపడాల్సిన అవసరం ఉంది. పాండోరా పేపర్స్​ బయట పెట్టిన పేర్లు.. విలాసవంతమైన జీవనశైలి ఉన్నవారిని, మరోవైపు కష్టపడి, నిజాయితీగా ఉన్న వారి మధ్య తేడాను కూడా చూపించింది. ఈ క్రమంలోనే ప్రపంచ అవినీతి, మనీలాండరింగ్​కు సంబంధించి బ్రిటన్​ పాత్రను మరోసారి అనుమానపడేలా చేయడమే కాకుండా, చట్టంలో ఉండే లొసుగులను బహిర్గతం చేసింది."

-డంకన్ హేమ్స్, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ యూకే

ఆఫ్‌షోర్ ఫైనాన్షియల్ సెంటర్లుగా (Offshore Tax Haven) పేరొందిన బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమాన్ దీవుల్లో ఉండే కంపెనీలు తమ అసలు యజమానుల పేర్లను బహిర్గతం చేయకపోతే వాటిని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలను ట్రాన్స్​పరెన్సీ ఇంటర్నేషనల్​ యూకే (Transparency International Uk) అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.

ఇదీ చూడండి: Pandora Papers Leak: 'పన్ను ఎగవేత మార్గాలను నిర్మూలించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.