పరారీలో ఉన్న రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టు మళ్లీ షాకిచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నీరవ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం కొట్టేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుంలో రూ. 13 వేల కోట్ల రుణ ఎగవేత, మనీ ల్యాండరింగ్ కేసులో నీరవ్‌ను భారత్‌కు అప్పగించే అవకాశాల నేపథ్యంలో బెయిల్ నిరాకరించింది కోర్టు.
కేంద్ర దర్యాప్తు సంస్థ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, బ్రిటన్‌కు చెందిన క్రౌన్ ప్రాసెక్యూషన్ సర్వీసుల సమన్వయంతోనే పదేపదే నీరవ్ బెయిల్ దరఖాస్తును ధర్మాసనం తిరస్కరిస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
గతంలో నీరవ్ బెయిల్‌ను నాలుగుసార్లు తిరస్కరించింది లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ జిల్లా న్యాయస్థానం. తర్వాత లండన్ హైకోర్టు రెండు దఫాలు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. తాజాగా వెస్ట్‌మినిస్టర్ న్యాయస్థానం ఏడోసారి తిరస్కరించింది.
ఇదీ చూడండి: 'స్వార్థ ప్రయోజనాల కోసం భారత్ యుద్ధం చేయదు'