ETV Bharat / international

ఆ దేశంలో ఇంధన సంక్షోభం.. బంకుల ముందు భారీ క్యూలు

పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా బ్రిటన్​లో పెట్రోల్ బంకులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడోచోట అందుబాటులో ఉన్న ఇంధనం కోసం.. వాహనదారులు బారులుతీరుతున్నారు. తగినంత మంది ట్యాంకర్ డ్రైవర్లు లేనందువల్లే అకస్మాతుగా ఈ సమస్య తలెత్తినట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపింది.

petrol shortage
ఇంధన సంక్షోభం
author img

By

Published : Sep 27, 2021, 7:39 PM IST

Updated : Sep 27, 2021, 10:33 PM IST

బ్రిటన్​లో పెట్రోల్​ బంకుల ముందు భారీ క్యూలు

పెట్రోల్​ బంకుల ముందు నో స్టాక్​ బోర్డులు, కిలోమీటర్ల కొద్దీ బారులుతీరిన వాహనాలు, వారిమధ్య వాగ్వాదాలు, రద్దీని నిలువరించేందుకు పనిచేస్తున్న సైన్యం.! ఇవీ.. బ్రిటన్​లోని పెట్రోల్ స్టేషన్ల ముందు కనిపిస్తున్న దృశ్యాలు. అక్కడ రిఫైనరీల నుంచి ఇంధనాన్ని సరఫరా చేసే ట్యాంకర్ డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. అయితే కరోనా వైరస్, బ్రెగ్జిట్‌ సహా పలు సమస్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బ్రిటన్​తో పాటు.. అమెరికా, జర్మనీలోనూ సమస్య తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నాయి.

petrol shortage
ఇంధనం కోసం పడిగాపులు తప్పనిసరి
petrol shortage
బంకుల ముందు వాహనాల రద్దీ
petrol shortage
తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు

ఇతర దేశాల నుంచి ట్రక్ డ్రైవర్లు..!

క్రిస్మస్ సమీపిస్తున్న నేపథ్యంలో రద్దీని నివారించేలా. ఇతర దేశాల నుంచి ట్రక్ డ్రైవర్లను రప్పించేందుకు అత్యవసర వీసాలను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 5వేల మంది ట్రక్కు డ్రైవర్లకు మూడు నెలల కాలానికి వీసాలు అందించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ప్రక్రియ చాలా ఆలస్యం అయిందని.. అయినప్పటికీ కొత్త వీసా ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

petrol shortage
కార్లలోనే వేచిచూస్తూ..
petrol shortage
ఓ వీధి మొత్తం వాహనాల బారులు
petrol shortage
పెట్రోల్ కష్టాలు

దేశంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల ముందు 'నో స్టాక్' బోర్డు దర్శనమిచ్చాయి. గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నప్పటికీ తమకు ఇంధనం లభించట్లేదని వాహనదారులు వాపోతున్నారు. చాలామంది సహనం కోల్పోయి గొడవలకు దిగుతున్నారు. అయితే.. పౌరులు కంగారుపడి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వల్లే ఈ కొరత ఏర్పడినట్లు పెట్రోల్ రిటైలర్స్ అసోసియేషన్ ఛైర్మన్ బ్రియాన్ మాడర్సన్ అన్నారు.

"దేశంలో ఇంధనం పుష్కలంగా ఉంది. అయితే ప్రస్తుతం అది వాహనదారులకు అందుబాటులో లేదు. పెట్రోలియం టెర్మినల్స్, రిఫైనరీలలో ఉంది. త్వరలోనే సరఫరా చేస్తాం."

-బ్రియాన్ మాడర్సన్, పెట్రోల్ రిటైలర్స్ అసోసియేషన్ ఛైర్మన్

బంకుల వద్ద నెలకొన్న రద్దీని నియంత్రించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపిన ప్రభుత్వం.. ప్రజల్లో నెలకొన్న భయాందోళనల వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని చెబుతోంది. పౌరులెవరూ ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని కోరింది. త్వరలోనే దీనిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

petrol shortage
ఓ పెట్రోల్ బంకు ముందు ఇలా..
petrol shortage
రాత్రయినా బారులు తీరిన వాహనాలు

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ నిష్క్రమణతో పాటు.. కరోనా విజృంభణ వల్ల విదేశీ కార్మికులు తరలివెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్రిటన్​లో దాదాపు పదివేల మంది ట్రక్కర్ల కొరత ఉన్నట్లు పరిశ్రమ వర్గాల అంచనా.

మరోవైపు.. దేశంలో ట్రక్ డ్రైవర్ల పని పరిస్థితులను వెంటనే మెరుగుపరచాలని యూకే లారీ డ్రైవర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 27, 2021, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.