ETV Bharat / international

భయపడినట్టే అయింది.. ఆ విమానాల్లో విదేశాలకు తాలిబన్లు! - అఫ్గానిస్థాన్​

అఫ్గాన్​ సంక్షోభం నేపథ్యంలో కాబుల్​ విమానాల(Kabul airport) నుంచి ఇతర దేశాలకు తాలిబన్లు(taliban news) కూడా వెళుతున్నారన్న ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తమ దేశానికి వచ్చిన అఫ్గాన్​వాసుల్లో ఓ వ్యక్తికి తాలిబన్లతో సంబంధం ఉన్నట్టు అనుమానించారు ఫ్రాన్స్​ అధికారులు. వెంటనే అతడిని అరెస్ట్​ చేశారు. విచారణలో ఆ వ్యక్తి నిజనాన్ని అంగీకరించాడు.

taliban
తాలిబన్​
author img

By

Published : Aug 24, 2021, 5:41 PM IST

పారిస్​కు చేరిన అఫ్గాన్​ శరణార్థుల్లో(afghan refugees) ఒకరిని ఫ్రాన్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తికి.. తాలిబన్లతో సంబంధాలున్నాయన్న అనుమానాలతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

ఇదీ జరిగింది...

అఫ్గాన్​లో తాలిబన్ల(taliban news) ఆక్రమణ నేపథ్యంలో అక్కడి ప్రజలు దేశాన్ని వీడేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అనేక మంది ఇప్పటికే విమానాల్లో ఇతర దేశాలకు వలసవెళ్లారు. వీరిలో 1,000కిపైగా మందికి ఫ్రాన్స్​ ఆశ్రయమిస్తోంది.

అలా వచ్చిన అఫ్గాన్​వాసుల్లో ఐదుగురిపై ఫ్రాన్స్​ అధికారులు నిఘా పెట్టారు. క్వారంటైన్​లో భాగంగా తొలుత వారికి పారిస్​లోని ఓ హోటల్​లో గదినిచ్చారు. వారిలో ఒకడు అక్కడి నుంచి పారిపోయాడు. గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం పోలీసులు అతడిని పట్టుకున్నారు.

విచారణలో భాగంగా తాను తాలిబన్లతో కలిసి పనిచేసినట్టు ఆ వ్యక్తి అంగీకరించాడు.

ఇదీ చూడండి:- తాలిబన్లతో అమెరికా సీఐఏ రహస్య చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.