ETV Bharat / international

ప్రయోగదశలో 12 కరోనా వ్యాక్సిన్లు- ఫలితం మాత్రం?

కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 100 పరిశోధన బృందాలు దాదాపు 12 రకాల వ్యాక్సిన్​లను తయారు చేశాయి. కానీ ఇవన్నీ ప్రస్తుతం మానవులపై ప్రయోగదశలోనే ఉన్నాయి. అయితే వీటిలో కొవిడ్​-19ను పూర్తిగా అడ్డుకోగలిగే వ్యాక్సిన్ ఉంటుందని కచ్చితంగా చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు.

corona vaccine
ప్రయోగదశలో 12 కరోనా వ్యాక్సిన్లు.. ఫలితం మాత్రం..!
author img

By

Published : May 4, 2020, 3:19 PM IST

Updated : May 4, 2020, 7:42 PM IST

ప్రయోగదశలో 12 కరోనా వ్యాక్సిన్లు- ఫలితం మాత్రం?

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అన్ని దేశాలు విస్తృత చర్యలు చేపట్టాయి. ఇప్పటికే వైరస్​ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు సైతం ఈ ప్రాణాంతక వైరస్​ను అంతమొందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 పరిశోధన బృందాలు ఇప్పటికే దాదాపు 12 రకాల వ్యాక్సిన్​లను తయారు చేశాయి. కానీ ఇవన్నీ ప్రస్తుతం మానవులపై ప్రయోగ దశలోనే ఉన్నాయి. అయితే వీటిలో కొవిడ్​-19ను పూర్తిగా అడ్డుకోగలిగే వ్యాక్సిన్ ఉంటుందని కచ్చితంగా చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు.

" ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలం కరోనాకు వ్యాక్సిన్​ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే మేమందరం ఒకరికొకరు పోటీదారులం కాదు. కొవిడ్​-19కు వ్యాక్సిన్​ కనిపెట్టేందుకు జరుగుతున్న పోటీలో ఎంత మంది వీలైతే అంత ఎక్కువ మంది పాలుపంచుకోవాలని కోరుతున్నాం."

- డాక్టర్​ ఆండ్రూ పొలార్డ్, ఆక్స్​ఫర్డ్ శాస్త్రవేత్త

వ్యాక్సిన్​కు ఇంకో ఏడాదిపైనే!

అన్నీ సవ్యంగా సాగితే.. మరో 12 నుంచి 18 నెలల్లో వ్యాక్సిన్​ రూపొందించగలమని అంటున్నారు అమెరికా ప్రభుత్వ ముఖ్యసలహాదారుడు డాక్టర్​ ఆంటోనీ ఫౌచీ. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో మనుషులపై పరీక్షించే డీఎన్​ఏ ఆధారిత వ్యాక్సిన్​ను​ గతనెలలోనే అభివృద్ధి చేశారు ఫౌచీ.

" ప్రస్తుతం చైనా, అమెరికా, బ్రిటన్​, జర్మనీలో 8 నుంచి 11 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగిస్తున్నారు. మే-జులై మధ్య కాలంలో మరో కొత్త రకం వ్యాక్సిన్​ను మనుషులపై ప్రయోగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికైతే కొవిడ్​-19 వ్యాక్సిన్​ పరిశోధనలో శాస్త్రవేత్తల కొరతేమీ లేదు."

- డాక్టర్​ ఆంటోనీ ఫౌచీ, అమెరికా శాస్త్రవేత్త

ఒకదానికి రూపొందిస్తే మరోదానిపై...

కొన్ని రకాల వైరస్​ల కోసం రూపొందించిన వ్యాక్సిన్​లు ఇతర వైరస్​లపై ప్రభావవంతంగా పనిచేస్తుంటాయని చెబుతున్నారు యేల్​ స్కూల్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​ శాస్త్రవేత్త డాక్టర్​ స్టెయిన్​ వెర్ముండ్​. అయితే కరోనా వైరస్​కు బ్లూప్రింట్​ లేదని, అందువల్లే వ్యాక్సిన్​ను కనిపెట్టేందుకు ఎక్కవ సమయం పడుతోందని అంటున్నారు.

" 2003లో సార్స్​ వైరస్​కు వ్యాక్సిన్​ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేసినప్పుడు.. కొన్ని రకాల కొత్త వైరస్​లు, జంతు పరిశోధనలు భద్రతాపరమైన హెచ్చరికలు చేశాయి. ఆ తర్వాత సార్స్​ కనుమరుగై.. వ్యాక్సిన్​ ప్రయత్నాలకు నిధుల మంజూరు పూర్తిగా నిలిచిపోయింది. మెర్స్​ వైరస్​ వ్యాక్సిన్​ ప్రయోగాలు కూడా మొదటిదశ పరీక్షల్లోనే ఆగిపోయాయి."

-డాక్టర్​ స్టెయిన్​ వెర్ముండ్, యేల్​ స్కూల్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​ డీన్​.

మరికొన్ని సంస్థల ప్రయత్నాలు

చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్​ కంపెనీలు కరోనా వైరస్​కు విరుగుడుగా అచేతన వ్యాక్సిన్​(ఇన్​యాక్టివేడెట్​ వ్యాక్సిన్​)లను పరీక్షిస్తున్నాయి. శరీరంలోని కరోనా వైరస్​ను గుర్తించేలా వ్యాధి నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చేందుకు మరికొన్ని వ్యాక్సిన్​లను అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం స్పైక్​ ప్రొటీన్​ను శరీరంలోనే ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా కొవిడ్​-19 వ్యాక్సిన్​ను ఆరు కోతులపై ప్రయోగించి విజయం సాధించారు. తాజాగా ట్రంప్​ కూడా ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా.. వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని నెలలు పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో వైరస్​ బారినపడి విరుగుడు మందు కోసం ఎదురు చూడటం కంటే.. వైరస్​ సోకకుండా జాగ్రత్తపడటమే మేలు.

Last Updated : May 4, 2020, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.