ETV Bharat / international

దేశానికి ప్రధానైనా బిడ్డకు డైపర్లు మార్చాల్సిందే!

author img

By

Published : Mar 6, 2020, 6:53 AM IST

Updated : Mar 6, 2020, 9:00 AM IST

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు ప్రధాని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పుట్టబోయే బిడ్డకు డైపర్స్ మారుస్తారా అన్న ప్రశ్నకు సిగ్గుతో తడబడ్డారు. ఇంతకీ జాన్సన్​ ఏం చెప్పారో తెలుసుకుందామా?

Britain prime minister boris johnson said interesting things about his new coming born baby
దేశానికి ప్రధానైనా.. బిడ్డకు డైపర్లు మార్చాల్సిందే!

బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​, సైమండ్స్​ ఇద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు జాన్సన్​. పుట్టబోయే బిడ్డకు డైపర్స్​ మారుస్తారా అని అడిగన ప్రశ్నకు సిగ్గుతో తడబడ్డారు ప్రధాని.

అయితే తాను ఆ పని చేయనని జాన్సన్​ అన్నారు. మళ్లీ తండ్రి కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న తన పిల్లలు ఈ వార్తకు ఎలా స్పందించారో చెప్పేందుకు జాన్సన్​ నిరాకరించారు.

బోరిస్​ జాన్సన్​ ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ సాగిందిలా...

ప్ర: మీకు పుట్టబోయే బిడ్డకు డైపర్లు మార్చటంపై ఎలా ఫీల్​ అవుతున్నారు?

జ: నేను ఆ పని చేయను. నిజంగా నేను అలా చేయను.

ప్ర: మీరు అలా చేయరు అంతేనా?

జ: అవును కచ్చితంగా నేను అలా చేయను.

ప్ర: ఇది ప్రతి తండ్రి జీవితంలో వచ్చే అనుభవం. కాదంటారా?

జ: అవును అలా జరగొచ్చేమో..

ప్ర: మీకు పుట్టబోయే బిడ్డపై మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు?

జ: అది ఏదేమైనప్పటికీ నేను............

ప్ర: వారు సంతోషించారా? మీకు అభినందనలు చెప్పారా?

జ: ఇది చాలా సంతోషకరమైన విషయం

Last Updated : Mar 6, 2020, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.