ETV Bharat / international

వయస్సులో చిన్నది... ఐక్యూలో పెద్దది - మెన్సా మెంబర్​షిప్​ క్లబ్​లోకి చేరిన నాలుగేళ్ల చిన్నారి

బ్రిటన్​కు చెందిన 4ఏళ్ల చిన్నారి 'మెన్సా మెంబర్​షిప్​ క్లబ్'​లో చోటు సంపాదించింది. అతి చిన్న వయస్సులో ఎక్కువ ఐక్యూ కలిగిన చిన్నారిగా గుర్తింపు పొందింది.

Mensa club of high IQ kids
వయసులో చిన్నది... ఐక్యూలో పెద్దది
author img

By

Published : Jan 30, 2021, 8:47 PM IST

బ్రిటన్​కు చెందిన నాలుగేళ్ల చిన్నారి అరుదైన ఘనత సాధించింది. అతి చిన్న వయస్సులో హై ఐక్యూ ఉన్న చిన్నారిగా 'మెన్సా మెంబర్​షిప్​ క్లబ్'​లో చోటు సంపాందించింది. ఏడాదిన్నర వయస్సు రాక ముందే... ఆంగ్ల అక్షరాలను నేర్చేసుకుంది. బర్మింగ్​హమ్​లో నివసిస్తున్న ఆ చిన్నారి పేరు దయాల్ కౌర్.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా మెన్సా పరీక్షను ఆన్​లైన్​ వేదికగా నిర్వహించారు. ఈ పరీక్షలో పాల్గొన్న దయాల్.. 145 ఐక్యూ స్కోర్​ సంపాందించి బ్రిటన్​లో అత్యధిక ఐక్యూ ఉన్న వారి సరసన చేరింది. తమ కూతురు సాధించిన ఈ ఘనతపై దయాల్​ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

"తల్లిదండ్రులుగా దయాల్​ చాలా తెలివైందని మేం భావిస్తాం. కానీ, ఇప్పుడు అది అధికారకంగా రుజువైంది. దయాల్​... లక్షల్లో ఒకరిగా ఈ ఘనత సాధించడం ఆనందంగా ఉంది."

-సర్బ్​జీత్​ సింగ్, దయాల్​ తండ్రి.

మెన్సా క్లబ్​లో దయాల్​ను చేర్చడంపై బ్రిటిష్​ మెన్సా ఛీఫ్​ ఎగ్జిక్యూటివ్​ జాన్​ స్టెవెనాగె హర్షం వ్యక్తం చేశారు. ఈ క్లబ్​లో 2000మంది చిన్నారులు ఉన్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో దయాల్​ మరిన్ని ఘనతలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'ఇండో-ఫసిఫిక్​లో అమెరికా వ్యూహానికి 'క్వాడ్​' పునాది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.