ETV Bharat / international

'కజఖిస్థాన్​లోని ఆ కొత్త వ్యాధి కరోనానే కావొచ్చు'

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కజఖిస్థాన్​లో గుర్తుతెలియని న్యుమోనియాను పోలిన వ్యాధి బయటపడ్డట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం వెల్లడించటం యావత్​ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. అయితే.. ఆ కొత్త వ్యాధి కరోనానే కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. దానిని నిర్ధరించేందుకు కరోనా పరీక్షలు, వాటి నాణ్యతపై దృష్టి సారించామని, ఇప్పటికే డబ్ల్యూహెచ్​ఓ బృందం కజఖిస్థాన్​కు వెళ్లిందని స్పష్టం చేసింది.

WHO believes 'unknown pneumonia' in Kazakhstan could be COVID-19
'కజఖిస్థాన్​లోని ఆ కొత్త వ్యాధి కరోనానే కావొచ్చు'
author img

By

Published : Jul 11, 2020, 4:20 PM IST

కజఖిస్థాన్​లో ఇటీవల బయటపడిన గుర్తుతెలియని న్యుమోనియా సంబంధిత వ్యాధి కరోనానే అయి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. కొవిడ్​-19 వల్లే ఆ వ్యాధి వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర విభాగం చీఫ్​ డా. మిచెల్​ ర్యాన్​.

"కొత్త న్యుమోనియా వ్యాధి సోకిన వారికి కరోనా నెగిటివ్​ వచ్చిన నేపథ్యంలో తప్పుడు ఫలితాలు లేవని నిర్ధరించుకోవడానికి.. కొవిడ్​-19 పరీక్షలు, వాటి నాణ్యతపై దృష్టిసారించాం. ఎక్కువ శాతం న్యుమోనియా కేసులు కరోనానే కావచ్చు. సరిగ్గా నిర్ధరణ కాలేదు అంతే."

- డా. మిచెల్​ ర్యాన్​, డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర విభాగం చీఫ్​

కొత్త వ్యాధి సోకిన వారి ఎక్స్-​రేలు పునఃసమీక్షించటం, న్యూమోనియా కేసుల్లో కరోనా లక్షణాలను పరిశీలించేందుకు స్థానిక అధికారులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పని చేస్తున్నట్లు చెప్పారు ర్యాన్​. అలాంటి కేసుల్లో చాలా వరకు కొవిడ్​-19గా నిర్ధరణ అవుతాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్​ఓ బృందం కజఖిస్థాన్​ చేరుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'భయపెడుతోన్న మరో మహమ్మారి.. కరోనా కంటే ప్రమాదకారి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.