ETV Bharat / international

కిమ్​ ఆరోగ్య పరిస్థితిపై ఐరాస కీలక వ్యాఖ్యలు - un

ఉత్తరకొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఆయన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో ఐక్యరాజ్యసమితి.. కిమ్​ గురించి తమకెలాంటి సమాచారం లేదని తెలిపింది. మరోవైపు.. కిమ్​ ఆరోగ్యంగానే ఉన్నారని దక్షిణ కొరియాకు, తనకు సమాచారం ఉందని ట్రంప్​ స్పష్టం చేశారు.

'We have no information about the situation of Kim Jong Un': UN chief Guterres
కిమ్​ గురించి మాకేం తెలియదు: గుటెరస్​
author img

By

Published : May 1, 2020, 12:59 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. అంతే వేగంగా ఉత్తరకొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​పై వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ స్పందించారు.

కిమ్​ ఆరోగ్యపరిస్థితులపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. 'కిమ్​కు సంబంధించి.. ఉత్తరకొరియా అధికారులతో ఐరాస సంభాషించిందా?' అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేశారు గుటెరస్​.

కరోనాపై పోరులో అమెరికా, చైనా కీలకం..

కొవిడ్‌-19పై పోరులో అంతర్జాతీయ స్థాయిలో చైనా, అమెరికా పాత్ర చాలా కీలకమైనదని గుటెరస్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల అభివృద్ధికి వీరిరువురి సహకారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు.

అసలేమైంది..?

రెండు వారాలుగా కిమ్​ ఆరోగ్యంపై వదంతులు ఊపందుకున్నాయి. ఏప్రిల్​ 15న తన తాత, ఉత్తరకొరియా వ్యవస్థాపకులు రెండో కిమ్​ సంగ్ 108వ జయంతి వేడుకలకు.. గైర్హాజరైనప్పటి నుంచి కిమ్​ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఉత్తరకొరియా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేస్తుండగా.. కిమ్ కోమాలోకి వెళ్లారని పలువురు అనుమానిస్తున్నారు.

ట్రంప్​దో మాట..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​... కిమ్​కు సంబంధించి మరోసారి ప్రకటన చేశారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసునని.. అంతా సజావుగానే సాగాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల గురించి ఇప్పుడే చెప్పలేనన్నారు.

పొరుగునే ఉన్న దక్షిణ కొరియా కూడా కిమ్​ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయనకేం అయినా తమకు సమాచారం అందుతుందని ఉద్ఘాటిస్తూ వస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.