దక్షిణ ఆస్ట్రేలియాలో 'మౌంట్ బోల్డ్' అతి పెద్ద జలాశయం. అడిలైడ్ నగరానికి ఈ జలాశయమే ప్రధాన నీటి వనరు. 50 మీటర్ల ఎత్తు, 46 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ డ్యాంను 1930 దశకంలో తాగునీటి అవసరాల కోసం నిర్మించారు. భారీ వరదలు, తీవ్రమైన భూకంపాలనూ తట్టుకుని నిలబడేలా ఈ డ్యాంను రీడిజైన్ చేసేందుకు అధికారులు ప్రణాళికలు వేశారు. నిజానికి, ఆ పనులు 2022లో ప్రారంభంకావాల్సి ఉండగా.. ఇంజనీర్లు డ్యాంను సందర్శించేందుకు వీలుగా జలాశయం మొత్తం ఖాళీ చేశారు.
అధికారుల అత్యుత్సాహం వల్లే..
అడిలైడ్ నగరంలో దాదాపు 45 లక్షల ఆవాసాలు, వ్యాపార కేంద్రాలకు మౌంట్ బోల్డ్ జలాశయం నుంచే నిత్యం నీటి సరఫరా జరుగుతుంది. ఇప్పుడు ఈ జలాశయం ఖాళీ అవడం వల్ల ఆ నగరంలోని లక్షల మంది నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అసలే ఎడారి రాష్ట్రం కావడం వల్ల నీటి వనరులు కూడా పరిమితమే. నిజానికి రెండేళ్ల తరవాత పనులు ప్రారంభంకావాల్సి ఉన్నా.. అధికారుల అత్యుత్సాహం వల్ల, లక్షల లీటర్ల నీరు వృథాగా పోయింది. గేట్లు బార్లా తెరిచి, నీటిని వదిలేయడం వల్ల నిండు కుండలా కళకళలాడే ఈ జలాశయం ఇప్పుడిలా ఎడారిని తలపిస్తోంది.
ఇదీ చదవండి: మాస్క్ అంటే మనకు చేదేమో.. జపాన్లో ఓ బాధ్యత