ETV Bharat / international

ఉక్రెయిన్​పై దండయాత్రకు రష్యా ప్రణాళిక- అమెరికా హెచ్చరిక! - రష్యా ఉక్రెయిన్​

Russia offensive Ukraine: ఉక్రెయిన్​పై సైనిక చర్యలకు రష్యా రంగం సిద్ధం చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. సరిహద్దుల్లో లక్షలాది మంది సైనికులను పంపించేందుకు పుతిన్​ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఘాటుగా స్పందించారు. రష్యాను ఎట్టిపరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

russia ukraine invasion
ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర.. అమెరికా హెచ్చరికలు!
author img

By

Published : Dec 4, 2021, 12:40 PM IST

Ukraine Russia war: 2022లో ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యలకు ఉపక్రమించనుందని అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో రష్యాను ఎట్టిపరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షు జో బైడెన్​ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్​ సరిహద్దుల్లో దాదాపు 1.75లక్షల మంది సైనికులను మోహరించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్​ ప్రణాళికలు రచిస్తున్నారని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. వీరిలో సగానికిపైగా సైనికులు ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్నట్టు పేర్కొన్నాయి. ఆర్మీ, ఆయుధాలు, సామగ్రితో కూడిన 100 బెటాలియన్లు సరిహద్దుల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్టు వెల్లడించాయి.

తాజా పరిణామాలపై బైడెన్​ ఆవేదన వ్యక్తం చేశారు.

"ఉక్రెయిన్​పై రష్యా చర్యలను ఎంతో కాలంగా మేము చూస్తూనే ఉన్నాము. ఈ విషయంపై పుతిన్​తో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉంది. ఉక్రెయిన్​పై రష్యా ఎలాంటి చర్యలు చేపట్టినా, అందుకు మేము వ్యతిరేకం. మిస్టర్​. పుతిన్​ను అడ్డుకునేందుకు మేము అన్ని సిద్ధం చేస్తాము."

-- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు.

Ukraine Russia conflict రష్యా-ఉక్రెయిన్​ మధ్య సరిహద్దు వివాదాలు గత కొంతకాలంగా తీవ్రరూపం దాల్చాయి. అదే సమయంలో నాటోతో సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఉక్రెయిన్​ ప్రయత్నిస్తోంది. దీనిని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాటోకు ఇప్పటికే హెచ్చరికలు పంపింది. ఉక్రెయిన్​.. నాటోలో చేరకుండా చూడాలని, హామీనివ్వాలని అమెరికాను పట్టుబట్టింది రష్యా.

పుతిన్​ సాహసం చేస్తారా?

క్షేత్రస్థాయిలో తన సైన్యాన్ని మునుపెన్నడూ లేనంత శక్తివంతంగా తీర్చిదిద్దారు పుతిన్​. అయితే.. ఉక్రెయిన్​పై దాడి చేయడం పుతిన్​ ప్రభుత్వానికి చాలా రిస్క్​తో కూడిన వ్యవహారం. రిస్క్​ చేసి ముందుకెళితే పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

వివాదం ఏంటి?

Russia Ukraine invasion: రష్యా- ఉక్రెయిన్​ మధ్య వివాదం 2014 నాటిది. నాడు.. ఇరు దేశాల సరిహద్దు భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి రష్యా మద్దతున్న వేర్పాటువాదులు- ఉక్రెయిన్​ బలగాల మధ్య అనేకమార్లు ఘర్షణ చెలరేగింది. ఈ గొడవల్లో దాదాపు 14వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా. అయితే 2020లో ఇరు పక్షాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితి కొంత చల్లబడింది. కానీ ఈ ఏడాది తొలినాళ్లలో సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి సరిహద్దుల్లో బలగాల సంఖ్యను పెంచుతూ వస్తోంది రష్యా.

ఇదీ చూడండి:- ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.