కాబుల్ విమానాశ్రయం(kabul airport news)లో తాలిబన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాబుల్ ఆక్రమణ అనంతరం ఎయిర్పోర్ట్లో నెలకొన్న పరిస్థితులను అదుపు చేసేందుకు.. అక్కడే ఉన్న అమెరికా, బ్రిటన్ సైనికులకు వీరు సహాయం అందిస్తున్నారు. ఓవైపు శరణార్థులకు సంబంధించిన పత్రాలను సైనికులు సరిచూస్తుంటే.. మరోవైపు ఎయిర్పోర్టు బయట ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ పరీక్షలను తాలిబన్ ఫైటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.
అయితే తాలిబన్ల(taliban news) చూపులు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. ఎప్పుడు ఎవరిని అనుమతిస్తారో, ఏ సమయంలో ఎవరిని అడ్డుకుంటారోనని భయపడిపోతున్నారు. ఒక్కోసారి.. తాలిబన్ ఫైటర్లు తుపాకులతో కొడుతుండటం, చేతికందిన దానిని విసురుతుండటం చూసి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొన్నేళ్లుగా అధ్యక్షుడు ఘనీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారు.. తాలిబన్లను చూసి గడగడలాడుతున్నారు.
తాలిబన్లు సైనికులకు సహకరిస్తుండటం చూసి తామే అశ్చర్యపోయామని బిటీష్ సైన్యానికి చెందిన లుటినెంట్ కల్నల్ విల్ హంట్ తెలిపారు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాలిబన్లు కూడా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.
అమెరికా దళాల ఉపసంహరణ పూర్తికాకముందే.. మెరుపువేగంతో దేశాన్ని ఆక్రమించుకున్నారు తాలిబన్లు(Afghanistan latest news). గత ఆదివారం కాబుల్పై తమ జెండా ఎగరేశారు. వారి వేగానికి ప్రపంచదేశాలు షాక్కు గురయ్యాయి. అనంతరం తాలిబన్ల చెర నుంచి విముక్తి పొందేందుకు అక్కడి ప్రజలు కాబుల్ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పదుల సంఖ్యలో అఫ్గాన్వాసులు ప్రాణాలు కోల్పోయారు. వారం రోజులు గడిచినా అక్కడ రద్దీ ఏమాత్రం తగ్గలేదు.
ఇవీ చూడండి:-