చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో భారత్‌కు ఫ్రాన్స్ అండగా ఉంటుందని ఆ దేశ రక్షణమంత్రి ఫ్లోరెన్స్ పార్లె ఇటీవలే వెల్లడించారు. తాజాగా... 59 చైనా యాప్స్‌ను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. ఈ నిర్ణయం భారత సమగ్రత, దేశ జాతీయ భద్రతను పెంపొందిస్తుందని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు.
"చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిఘా వ్యవస్థకు చెందిన పలు యాప్స్‌ను భారత్ నిషేధించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయంతో భారత సార్వభౌమాధికారం మరింత దృఢంగా మారింది. జాతీయ భద్రత, సమగ్రత కూడా పెరుగుతుంది."
-- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి.
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు, గల్వాన్ లోయలో హింసాత్మక ఘటన నేపథ్యంలో భారత్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్స్‌ను భారత్ నిషేధించింది.