Pak Economy Collapse: సెర్బియాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఖాతా నుంచి వచ్చిన ఓ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం తమకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని అక్కడి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ పోస్ట్ ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్ నిమిషాల్లో వైరల్‌గా మారిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే.. పాక్ రాయబార కార్యాలయం ఖాతా నుంచి ఆ ట్వీట్ అదృశ్యమైంది. ఈ పూర్తి వ్యవహారంపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
ట్వీట్లో ఏముందంటే..
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్న విషయం ప్రపంచ దేశాలు తెలిసినదే. అందుకు తగ్గట్టుగానే ఈ ట్వీట్ కూడా ఉంది.
"ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిల్లో పెరిగిపోయింది. మూడు నెలలుగా మాకు జీతాలివ్వడం లేదు. ఇంకెంత కాలం నిశ్శబ్దంగా ఉండాలి ప్రధాని ఇమ్రాన్ ఖాన్? పిల్లల ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితి. వాళ్ల స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారు. సమస్యను బహిరంగంగా లేవనెత్తడం తప్ప నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. క్షమించండి."
--- సెర్బియాలోని పాక్ రాయబార కార్యాలయం ట్వీట్
Pakistan embassy Serbia twitter: ఈ ట్వీట్‌కు ఇమ్రాన్‌ఖాన్ ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేసింది రాయబారి కార్యాలయం. 'ఆప్ నే గబ్రానా నహీ(మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు)..' అని గతంలో ఇమ్రాన్ అన్న మాటలతో వ్యంగ్యంగా రూపొందించిన ఓ వీడియోను తన ట్వీట్‌కు జతచేసింది. 'పిల్లల చదువుకు ఫీజులు కట్టలేకపోతున్నాము.. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి.. జీతాలివ్వడం లేదు.. ఇక ఆందోళన చెందకుండా ఎలా ఉంటాము?' అని ఆ వీడియోలో ప్రశ్నించింది.
-
Ideally made in honour of @ImranKhanPTI . He must be real proud hearing this. After all this is his daily advice to all Pak folks pic.twitter.com/pvsfQiGuPA
— Maj Gen Harsha Kakar (@kakar_harsha) December 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ideally made in honour of @ImranKhanPTI . He must be real proud hearing this. After all this is his daily advice to all Pak folks pic.twitter.com/pvsfQiGuPA
— Maj Gen Harsha Kakar (@kakar_harsha) December 3, 2021Ideally made in honour of @ImranKhanPTI . He must be real proud hearing this. After all this is his daily advice to all Pak folks pic.twitter.com/pvsfQiGuPA
— Maj Gen Harsha Kakar (@kakar_harsha) December 3, 2021
పాక్ స్పందన ఇలా..
ఆ ట్వీట్ వైరల్‌గా మారిన కొద్దిసేపటికే.. పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. పాక్ రాయబార కార్యాలయానికి చెందిన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్టు ఓ ప్రకటన చేసింది. రాయబార కార్యాలయానికి చెందిన సిబ్బంది.. ఆ ట్వీట్లు చేయలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేసింది.
నెట్లో ట్రోల్స్..
పాకిస్థాన్ పరిస్థితి, రాయబార కార్యాలయానికి చెందిన ట్వీట్‌పై ట్రోల్స్ వేస్తున్నారు నెటిజన్లు. 'పాపం పాక్', 'ఇమ్రాన్‌ఖాన్ హామీనిచ్చిన నయా పాక్ అంటే ఇదేనా,' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఆర్థిక సంక్షోభంలో పాక్..
చరిత్రలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని పాక్ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. ఇమ్రాన్ ప్రభుత్వానికి విదేశీ అప్పులు భారీగా పెరిగిపోయాయి. వీదేశీ అప్పులు ఎక్కువగా ఉన్న తొలి 10 దేశాల్లో పాక్ చేరినట్టు ఇటీవలే ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.
పాకిస్థాన్‌లో లీటరు పెట్రోలు రూ. 145 వద్ద ఉంది. ద్రవ్యోల్బణం 11.5శాతంగా ఉంది.
'నయా పాకిస్థాన్' నినాదంతో 2018 ఆగస్టులో అధికారాన్ని చేపట్టారు ఇమ్రాన్‌ఖాన్. అప్పుడు ఆయనకు స్వాగతం పలికిన ప్రజలు.. ఇప్పుడు అదే 'నయా పాక్' నినాదంపై జోకులు వేసుకోవడం మొదలుపెట్టారు. 'మీ నయా పాక్ మాకు వద్దు.. కనీసం మా పాత పాకిస్థాన్‌ను మాకు తిరిగి ఇచ్చేయండి' అని అంటున్నారు.
ఇదీ చూడండి:- మనోళ్లు భారత్‌ను చూసి నేర్చుకోవాలి: పాక్ ప్రధాని