North Korea missile test: ఆదివారం శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా... తాజాగా అందుకు సంబంధించిన చిత్రాలను అధికారికంగా విడుదల చేసింది. సముద్ర మట్టానికి సుమారు 2 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి క్షిపణి తీసిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో కొరియా ద్వీపకల్పంతో పాటు సమీప ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యంతర శ్రేణికి చెందిన హాసాంగ్-12 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది.
US Guam North Korea test
అమెరికాకు చెందిన గువామ్ ద్వీపాన్ని ఢీకొట్టే సామర్థ్యం ఈ క్షిపణి కలిగి ఉందని ఉత్తర కొరియా పేర్కొంది. ఈ క్షిపణిని ప్రామాణిక కోణంలో ప్రయోగిస్తే 4,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అమెరికాకు చెందిన గువామ్ ద్వీపం 3400 కి.మీ దూరంలో ఉంది.
ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణి సుమారు రెండు వేల కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన్నట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని అంచనా వేశాయి. 30 నిమిషాల పాటు ప్రయాణించి తమ దేశ అధీనంలోని సముద్ర జలాల్లో పడిపోయాయని జపాన్ కేబినెట్ ముఖ్య కార్యదర్శి హిరోకాజు మత్సునో తెలిపారు. మరోవైపు ఉత్తర కొరియా చేసిన క్షిపణి పరీక్షను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: కిమ్ కవ్వింపు.. ఈసారి శక్తిమంతమైన క్షిపణి ప్రయోగం