ETV Bharat / international

భూకంపాన్నే లెక్కచేయని ప్రధాని.. యథావిధిగా! - new zealand pm TV interview during quake

టీవీ ఇంటర్వ్యూ సమయంలో భూకంపం సంభవించినా ఎలాంటి భయాందోళనకు గురి కాలేదు న్యూజిలాండ్​ ప్రధాని జెసిండా ఆర్డెర్న్​. ముఖాముఖి యథావిధిగా కొనసాగించారు.

New Zealand leader carries on with TV interview during quake
భూకంపాన్ని లెక్క చేయని ప్రధాని.. యథావిధిగా టీవీ ఇంటర్వ్యూ
author img

By

Published : May 25, 2020, 11:03 AM IST

భూమి కంపించినట్లు అనిపిస్తే ఎవరైనా హడలిపోయి పరుగులు పెడతారు. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మాత్రం అలా చేయలేదు. భూకంపాన్ని లెక్కచేయకుండా తన టీవీ ఇంటర్వ్యూను యథావిధిగా కొనసాగించారు.

భూకంపాన్నే లెక్క చేయని ప్రధాని

న్యూజిలాండ్​ రాజధాని వెల్లింగ్టన్​లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో భూకంపం సంభవించింది. అదే సమయంలో లైవ్ టీవీ ఇంటర్వ్యూలో ఉన్నారు జెసిండా. భూమి కంపించిన విషయాన్ని గమనించి కొన్ని క్షణాల పాటు ఆగారు. పార్లమెంటు ఆవరణలో భూప్రకంపనలు వచ్చాయని, వెంటనే ఆగిపోయాయని, ఈ విషయాన్ని మీరు గమనిస్తున్నారా? అని వార్తాసంస్థ ప్రతినిధికి లైవ్​లోనే అడిగారు. ఆ సమయంలో ఆమె ఎలాంటి భయాందోళనకు గురికాకపోవడం ఆశ్చర్యపరిచింది.

వెల్లింగ్టన్​కు ఈశాన్యంలో 100 కి.మీ దూరంలోని సముద్రంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రత నమోదైనట్లు పేర్కొంది.

వేలాదిమంది న్యూజిలాండ్ వాసులు తమ పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఉదయాన్నే భూకంపం వచ్చింది. ఈ ధాటికి ఇళ్లలోని వస్తువులు పడిపోయాయి. రైల్వే సేవలను నిలిపివేశారు. అయితే ఎక్కడా పెద్దగా నష్టం జరిగినట్లు గానీ, గాయపడినట్లు గానీ సమాచారం లేదు.

న్యూజిలాండ్​లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2011లో క్రైస్ట్​చర్చ్​లో వచ్చిన భారీ భూకంపం 185 మంది ప్రాణాలను బలిగొంది. తీవ్ర ఆస్తినష్టం కలిగించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.