ETV Bharat / international

భారత్​తో నేపాల్​ మరో కయ్యం- బోర్డు పెట్టి మరీ... - నేపాల్

ఇటీవలి కాలంతో తరచుగా భారత్​తో సరిహద్దు వివాదానికి కాలుదువ్వుతున్న నేపాల్... మరోసారి దుందుడుకుగా వ్యవహరించింది. బిర్గుంజ్​ - రక్సాల్ ప్రాంతాలను కలిపే ఓ వంతెనపై బోర్డు ఏర్పాటు చేసి, ఇది తన భూభాగానికి చెందుతుందని పేర్కొంది. అయితే ఎస్​ఎస్​బీ దళాల రంగ ప్రవేశంతో వెనక్కి తగ్గిన నేపాల్.. వంతెనపై ఏర్పాటు చేసిన బోర్డును తొలగించింది.

Nepal puts up board claiming area under no man's land, later removes it
మరోసారి భారత్​తో కయ్యానికి దిగిన నేపాల్!
author img

By

Published : Jul 8, 2020, 4:07 PM IST

భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపాల్​ మరోసారి దుందుడుకుగా వ్యవహరించింది. ఇరుదేశాల మధ్య ఉన్న ఓ తటస్థ ప్రాంతాన్ని (నో మ్యాన్స్ లాండ్​) తన భూభాగంగా చూపించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎస్​ఎస్​బీ సిబ్బంది జోక్యంతో వెనక్కి తగ్గింది.

ఫ్రెండ్​షిప్​...!

నేపాల్​ పోలీసులు మంగళవారం బిర్గుంజ్​ - బిహార్​లోని రక్సాల్​ ప్రాంతాన్ని కలిపే మైత్రేయి (ఫ్రెండ్​షిప్) వంతెనపై బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో 'నేపాల్ పార్సా జిల్లాలోని బిర్గుంజ్ పట్టణ భూభాగం ఈ వంతెన నుంచే ప్రారంభమవుతుంది' అని ఉంది. ఇందులోనే స్థానిక నేపాల్ అధికారుల ఫోన్​ నెంబర్​ కూడా ఉంది.

స్థానిక బిహార్ ప్రజలు నేపాల్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. విషయం తెలుసుకున్న ఎస్​ఎస్​బీ సిబ్బంది రంగంలోకి దిగారు. దీనితో వెనక్కి తగ్గిన నేపాల్ పోలీసులు... ఆ బోర్డును తొలగించారు.

ఎస్​ఎస్​బీ సిబ్బంది కఠిన వైఖరి ప్రదర్శించిన తరువాతే నేపాల్ పోలీసులు... వంతెనపై ఏర్పాటుచేసిన బోర్డును తొలగించినట్లు స్థానికులు తెలిపారు.

ఇది మొదటిసారి కాదు..

నేపాల్ ఇటీవల తరచుగా భారత్​తో సరిహద్దు వివాదానికి కాలుదువ్వుతోంది. అందులో భాగంగా ఇరుదేశాల మధ్య ఉన్న ఈ తటస్థ ప్రాంతంలో కరోనా రోగుల అంతిమ సంస్కారాలను నిర్వహిస్తోంది.

నేపాల్ జూన్​లో భారత సరిహద్దులోని పాంతోలా గ్రామంలో తాత్కాలిక శిబిరాన్ని, వాచ్ టవర్​ను ఏర్పాటుచేసింది. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ఎస్​ఎస్​బీ సిబ్బంది, నేపాల్ దళాల మధ్య పలుదఫాలుగా చర్చలు జరిగిన తరువాత... వాటిని తొలగించింది.

అదే నెలలో ఓ నేపాల్ పోలీసు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్​లోని సీతామడి జిల్లాలోని భారత్-నేపాల్ సరిహద్దులో జరిగింది.

ఇదీ చూడండి: 'మహా' సంకీర్ణంలో సునామీ- త్వరలో కుప్పకూలే దిశగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.