ETV Bharat / international

Volcano eruption: పేలిన అగ్ని పర్వతం- 13 మంది మృతి - death toll in volcano blast indonesia

Indonesia volcano eruption: ఇండోనేసియా జావాలోని మౌంట్ సెమెరు అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున లావా విరజిమ్మగా సమీప గ్రామాలపై బూడిద పేరుకుపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Volcano eruption indonesia, mount semeru erutption
పేలిన అగ్ని పర్వతం
author img

By

Published : Dec 5, 2021, 11:32 AM IST

Indonesia volcano eruption: ఇండోనేసియాలోని జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం బద్ధలు కావడం వల్ల హృదయవిదారక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. మరో ఏడుగురు అదృశ్యమయ్యారు. ఈ మేరకు అధికారులు ఆదివారం తెలిపారు. దట్టమైన పొగ, బురద.. సహాయక చర్యలకు అవరోధంగా మారాయని చెప్పారు.

Mount semeru: తూర్పు జావా రాష్ట్రంలోని లుమాజాంగ్ జిల్లాలో ఉన్న మౌంట్ సెమెరు అగ్నిపర్వతం భారీ వర్షాల కారణంగా శనివారం ఆకస్మాత్తుగా విస్ఫోటనం చెందింది. దీంతో ఆకాశంలో 12,000 మీటర్ల ఎత్తున బూడిద ఎగజిమ్మింది. ఘటనా సమయంలో గ్యాస్​, లావా పెద్దఎత్తున ఉబికి వచ్చాయి. పలుగ్రామాలపై బూడిద కమ్ముకుంది. ఎడతెరపి లేని వర్షం కారణంగా అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్ధలైందని జియోలాజికల్ సర్వే సెంటర్​ అధిపతి ఈకో బుది లియోల్నో తెలిపారు. వర్షం, బూడిద కారణంగా భారీగా బురద పేరుకుపోయిందని వెల్లడించారు.

Volcano eruption indonesia
అగ్నిపర్వతం పేలుడు ధాటికి ధ్వంసమైన ఇల్లు
Volcano eruption indonesia
ఎగజిమ్ముతున్న పొగ, బూడిద
Volcano eruption indonesia
సహాయక చర్యలు

"అగ్నిపర్వతం బద్ధలు కావడం వల్ల లావా సమీపంలోని నదిలో 800 మీటర్ల దూరం ప్రవహంచింది. శనివారం రెండు సార్లు ఈ అగ్నిపర్వతం పేలింది. అగ్నిపర్వతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను 5కి.మీ.ల దూరంలో ఉండాలని సూచించాం."

-ఈకో బుది లియోల్నో, జియోలాజికల్ సర్వే సెంటర్​

పెద్దఎత్తున బూడిద ఎగజిమ్మగా పలు గ్రామాలు గాఢాంధకారంలో చిక్కుకున్నాయని లుమాజాంగ్ జిల్లా అధిపతి తోరికల్ హక్ తెలిపారు. వందలాది మంది గ్రామాలను వీడి తాత్కాలిక శిబిరాలకు, ఇతర సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని చెప్పారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ఆయా గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందని చెప్పారు.

Volcano eruption indonesia
ఎగజిమ్ముతున్న పొగ, బూడిద
Volcano eruption indonesia
ఇంటిపై పేరుకుపోయిన బూడిద
Volcano eruption indonesia
గాయపడ్డ వ్యక్తినిఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

అగ్నిపర్వతం బద్ధలు కావడం వల్ల కురాకోబాన్​కు చెందిన 13 మంది మరణించారని నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రతినిధి అబ్దుల్​ ముహరీ తెలిపారు. 57 మంది ఆస్పత్రుల్లో చేరగా.. వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మిగతా ఏడుగురు గల్లంతు కాగా వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ గ్రామంలోని అన్ని ఇళ్లు ధ్వంసం కాగా... 900 మందికిపైగా ప్రభుత్వ శిబిరాలకు చేరుకున్నారని చెప్పారు.

ఇదీ చూడండి: Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇదీ చూడండి: వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు విలవిల- పెరుగుతున్న క్యాన్సర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.