ETV Bharat / international

Massoud Afghan: తాలిబన్లను ఢీకొట్టేందుకు భారత్​ సాయం కోరిన మసూద్​? - taliban india

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల(Afghanistan Taliban) ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే.. ప్రపంచదేశాలన్నీ దీనిని అధికారికంగా గుర్తించడంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. తాలిబన్ల విషయంలో(taliban latest news) ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయితే.. అక్కడ తాలిబన్లపై పంజ్​షేర్​లోని(panjshir news) తిరుగుబాటు దళాలు (Massoud Afghan) ఇంకా పోరాటం సాగిస్తున్నాయి.​​ ఇప్పుడు.. వారు భారత్​ మద్దతు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. భారత్​ సాయం చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాయి పంజ్​షేర్​లోని మసూద్​ దళాలు.

Massoud Afghan
అఫ్గానిస్థాన్​ తాలిబన్లు, తాలిబన్​ వార్తలు
author img

By

Published : Sep 18, 2021, 1:38 PM IST

తాలిబన్లపై పోరు కోసం.. భారత్​ తమకు మద్దతు ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాయి పంజ్​షేర్​లోని(panjshir news) తిరుగుబాటు దళాలు. వియాన్​(డబ్ల్యూఐఓఎన్​) అనే వార్తా ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దిగ్గజ మిలటరీ కమాండర్​ అహ్మద్​ షా మసూద్(Massoud Afghan) మేనకోడలు అమీనా జియా మసూద్(Amina Zia Massoud)​ స్వయంగా ఈ విషయం చెప్పడం విశేషం.

అఫ్గాన్ ప్రముఖ కార్యకర్త, రచయిత అయిన అమీనా.. ఏళ్లుగా భారత్​తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. తమకు కచ్చితంగా మద్దతు ఇచ్చే దేశాల్లో భారత్​ ఒకటని ఆమె అభిప్రాయపడ్డారు.

తాలిబన్ల పాలనపై భారత నమ్మకం ఉంచదని తనకు తెలుసని వ్యాఖ్యానించారు మసూద్ (Ahmed Masood panjshir)​. అందుకే.. భారత్​ తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించదని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

''తాలిబన్లు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు.. మా కుటుంబం కాబుల్​లోనే ఉంది. మేం వెంటనే మొదటి ఫ్లైట్​లోనే దిల్లీకి వెళ్లిపోయాం. అలా నా బాల్యం రెండేళ్లు అక్కడే గడిచిపోయింది. భారత్​తో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. భారత్​ తమ బాధ్యతగా.. రెసిస్టెన్స్​ దళాలకు మద్దతు ఇస్తుందని నేను అనుకుంటున్నా.''

- అమీనా జియా మసూద్​, అఫ్గాన్​ కార్యకర్త, రచయిత

పంజ్​షేర్​ను(panjshir news) తాలిబన్లు ఆక్రమించుకున్నట్లు ఎన్నో నకిలీ వార్తలొచ్చాయని, ఇవి తమ పోరాటంపై ప్రభావం చూపాయని మసూద్​ తెలిపారు. తాలిబన్లపై తిరుగుబాటు (panjshir taliban) కొనసాగుతుందని అన్నారు.

''సమాచార వ్యవస్థను స్తంభింపచేశారు. ఇంటర్నెట్​ ఆగిపోయింది. ఈ సమయంలో ఎన్నో నకిలీ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ.. మీకు చెప్పేది ఒకటే. తిరుగుబాటు ఇంకా కొనసాగుతోంది. పంజ్​షేర్​ను ఆక్రమించుకోవడం చాలా క్లిష్టతరం. శక్తిమంతమైనది మాత్రమే కాకుండా.. భౌగోళికంగానూ పంజ్​షేర్​ చాలా పెద్దదని తాలిబన్లకు అర్థమైందనుకుంటా.''

అఫ్గానిస్థాన్‌ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi Afghanistan) శుక్రవారం.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల పేరును ఎక్కడా ప్రస్తావించని మోదీ.. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ అఫ్గాన్‌.. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అక్కడి నూతన ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అంతర్జాతీయ సమాజం ఆచితూచి అడుగులు వేయాలని, విస్తృత చర్చల అనంతరమే ఓ నిర్ణయానికి రావాలని స్పష్టం చేశారు. షాంఘై శిఖరాగ్ర సదస్సుకు వర్చువల్​గా హాజరైన మోదీ (Narendra Modi Afghanistan).. అఫ్గాన్​లో ప్రభుత్వ మార్పు అందరి ఆమోదంతో జరగలేదని అన్నారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎందరో నిరాశ్రయులయ్యారు..

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల రాకతో(Afghanistan taliban).. దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోందని అన్నారు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్​ ఫిలిప్పో గ్రాండీ. భయంతో ఎందరో ఇళ్లు విడిచి పారిపోయారని, వారికి అంతర్జాతీయ సమాజం డబ్బు మాత్రమే ఇచ్చి వదిలేయకుండా, ఆశ్రయం ఇవ్వాలని అభ్యర్థించారు.

తాలిబన్ల ఆక్రమణ అనంతరం.. దాదాపు 35 లక్షల మంది అఫ్గాన్​లు నిరాశ్రయులుగా మారారని, వారంతా దేశంలోనే ఎక్కడోచోట ఉండిపోయారని యూఎన్​ రిఫ్యూజీ ఏజెన్సీ వెల్లడించింది.

వారిపై ఎందుకు వివక్ష?

అఫ్గానిస్థాన్​లో పాఠశాలల పునఃప్రారంభం నిర్ణయాన్ని స్వాగతించింది యూనిసెఫ్​. అయితే.. బాలికలకు అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంపై ఆందోళన చెందుతున్నామని, పునరాలోచించుకోవాలని కోరారు యూనిసెఫ్​ చీఫ్​ హెన్రెట్టా ఫోర్​.

ఇవీ చదవండి:

వీళ్లు చిటికేస్తే.. అఫ్గాన్​లో 'అంతర్యుద్ధం' తథ్యం!

పంజ్​షేర్​ తాలిబన్లదేనా? ఈ ఫొటోల సంగతేంటి?

'పంజ్​షేర్​'పై తాలిబన్లు గెలిచారా? అసలు నిజం ఇదీ...

తాలిబన్లను ఎదుర్కొనేందుకు భారత బలగాల కసరత్తు!

ఒకప్పుడు ఖైదీలు.. ఇప్పుడదే జైలుకు బాస్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.