Japanese tycoons space tour: అంతరిక్ష పర్యటకంలో మరో ముందడుగు పడింది. జపాన్‌కు చెందిన బిలియనీర్ యుసాకు మిజవా, నిర్మాత యోజో హిరానా అంతరిక్ష యాత్ర చేపట్టారు. 2009 తర్వాత సొంత ఖర్చులతో అంతరిక్షానికి బయల్దేరిన పర్యటకులు వీరే కావడం గమనార్హం.
Yusaku Maezawa space tour: రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ మిసుర్కిన్తో కలిసి యుసాకు, యోజో హిరానా.. సోయూజ్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:38 గంటలకు ఈ ముగ్గురూ... కజకిస్థాన్‌లోని బైకోనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి వ్యోమనౌకలో బయల్దేరారు. మిజవా, హిరానో 12 రోజులపాటు అంతరిక్షంలో గడపనున్నారు. అయితే.. ఈ ప్రయాణానికి అయిన ఖర్చులను వారు వెల్లడించలేదు.
"అంతరిక్షం నంచి నేను భూమిని చూడాలనుకుంటున్నాను. బరువు లేకపోవడం వల్ల కలిగే అనుభూతిని పొందాలనుకుంటున్నాను. నన్ను అంతరిక్షం ఎలా మారుస్తుందో, ఈ పర్యటన తర్వాత నేను ఎలా మారుతానో చూడాలని నాకు ఆత్రుతగా ఉంది" అని అంతరిక్ష ప్రయాణానికి ముందు బిలియనీర్ మిజువా తెలిపారు.
ఇదీ చూడండి: చంద్రుడిపైకి వెళ్లాలని ఉందా.. ఇదిగో ఛాన్స్!