షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) పీస్ మిషన్లో భాగంగా రష్యాలో జరగనున్న ఉగ్రవాద నిరోధక యుద్ధ విన్యాసాల్లో భారత్ పాల్గొననుంది. ఇదే కార్యక్రమంలో చైనా-పాకిస్థాన్ కూడా పాలుపంచుకోనున్నాయి(india china relations). ఆయా దేశాలతో భారత్కు గత కొంత కాలంగా విభేదాలు నెలకొన్న తరుణంలో రష్యాలో జరగనున్న కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది.
విన్యాసాలు ఈ వారంలో ప్రారంభమై.. ఈ నెల 26 వరకు కొనసాగుతాయి. దేశం తరఫున ఉన్నతస్థాయి సైనిక, వాయుసేన దళాలు రష్యాకు వెళ్లనున్నాయి. వాస్తవానికి ఈ విన్యాసాలు గతేడాది కూడా జరగ్గా.. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తప్పుకుంది భారత్(india china border news).
సరిహద్దు ఉద్రిక్తతలతో పాటు తాజాగా ఏర్పడిన అఫ్గాన్ సంక్షోభంపైనా చైనా-పాక్, భారత్ మధ్య విభేదాలున్నాయి(india pak relations). తాలిబన్ల ప్రభుత్వానికి ఆ దేశాలు మద్దతిస్తుండగా.. భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.
భారత బృందంలో కొందరు.. ఇప్పటికే రష్యాలో జరుగుతున్న జాపద్-21 విన్యాసాలకు హాజరయ్యారు. ఇందులో చైనా-పాక్ పరిశీలకులుగా ఉన్నాయి.
-
#WATCH | Para jump by Indian Army and Indian Air Force commandos in the Zapad-21 exercise in Russia
— ANI (@ANI) September 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Video courtesy: Indian Army pic.twitter.com/7mjdpMMBCA
">#WATCH | Para jump by Indian Army and Indian Air Force commandos in the Zapad-21 exercise in Russia
— ANI (@ANI) September 13, 2021
Video courtesy: Indian Army pic.twitter.com/7mjdpMMBCA#WATCH | Para jump by Indian Army and Indian Air Force commandos in the Zapad-21 exercise in Russia
— ANI (@ANI) September 13, 2021
Video courtesy: Indian Army pic.twitter.com/7mjdpMMBCA
ఇదీ చూడండి:- ఉగ్రవాదం నిర్మూలనకు 'షాంఘై' దేశాల తీర్మానం!