ETV Bharat / international

'భారత్ దాడి చేస్తుందని పాక్ ఆర్మీ చీఫ్ వణికిపోయారు' - mahamood qureshi latest news

గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు పాకిస్థాన్​లోని ఓ ప్రతిపక్ష నేత. వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ను పాక్​ నిర్బంధించినప్పుడు ఆ దేశ ఆర్మీ ఛీఫ్​ ఖమర్​ జావేద్​ బాజ్వా వణికిపోయారని అన్నారు.

india will attack if we dont release abhinandan pakistan mp recounts in parliament
'పాకిస్థాన్​ ఆర్మీ ఛీప్​ ఆరోజు చాలా భయపడ్డారు'
author img

By

Published : Oct 29, 2020, 7:36 AM IST

గతేడాది ఫిబ్రవరిలో భారత వైమానిక దళ వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ను పాకిస్థాన్​ నిర్బంధించింది. ఆ సమయంలో పాక్​ ఆర్మీ ఛీఫ్​ ఖమర్​ జావేద్​ బాజ్వా.. తీవ్ర భయాందోళనకు గురయ్యారని పాకిస్థాన్​ ముస్లిం లీగ్​-ఎన్​(పీఎమ్​ఎల్​-ఎన్​)నేత అయాజ్ ​సాదిఖ్ అన్నారు.

అభినందన్​​ను వదిలిపెట్టకపోతే.. భారత్​ తమ దేశంపై దాడి చేస్తుందని బాజ్వా వణికిపోయారని చెప్పారు. ఆ దేశ పార్లమెంట్​ సమావేశంలో అయాజ్ ​సాదిఖ్​ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

"ఆరోజు జరిగిన సమావేశం నాకు బాగా గుర్తుంది. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి.. పార్లమెంటరీ నేతలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్​ ఖాన్​ హాజరు కాలేదు. అభినందన్​ను గనుక విడిచిపెట్టకపోతే.. రాత్రి 9 గంటలకల్లా పాకిస్థాన్​పై భారత్​ దాడి చేస్తుందని ఖురేషి హెచ్చరించారు. ఆ సమయంలో ఆర్మీ ఛీఫ్​ బాజ్వా కాళ్లు వణకడం నేను గమనించాను. "

-- అయాజ్​ సాదిఖ్​, పాకిస్థాన్​ ప్రతిపక్ష నేత.

2019,ఫిబ్రవరి 27న పాకిస్థాన్​ యుద్ధవిమానం ఎఫ్​-16 కూల్చివేయడంలో ధైర్య, సాహసాలు ప్రదర్శించారు భారత వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​. అదేరోజు ఆయనను పాకిస్థాన్ నిర్బంధించింది. ఎట్టకేలకు 2019, మార్చి 1న తిరిగి స్వదేశానికి చేరుకున్నారు అభినందన్​. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక 'వీర్​ చక్ర' పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.

ఇదీ చూడండి:పాక్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల జ్వాల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.