ETV Bharat / international

భారత్​-చైనా వివాదం పరిష్కారానికి 'పంచ ప్రణాళిక' - భారత్ చైనా మధ్య వివాదానికి కారణాలు

కొన్ని నెలలుగా సరిహద్దుల్లో నెలకొన్న వివాదానికి తెరదించేందుకు భారత్​-చైనా కీలక ముందడుగు వేశాయి. రష్యాలో సమావేశమై ఉభయ దేశాల విదేశాంగ మంత్రులు వివాద పరిష్కారానికి.. ఐదు అంశాల ప్రణాళికకు అంగీకారం తెలిపారు.

INDIA CHINA BORDER ISSUE RESOLVING PLAN
సరిహద్దు వివాద పరిష్కారానికి భారత్ చైనా పంచ ప్రణాళిక
author img

By

Published : Sep 11, 2020, 7:37 AM IST

Updated : Sep 11, 2020, 10:50 AM IST

తూర్పు లద్దాఖ్​లో భారత్, చైనా సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రష్యాలో ఉభయ దేశాల విదేశాంగ మంత్రులు గురువారం భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశం తర్వాత.. సరిహద్దు వివాదం పరిష్కారానికి ఐదు అంశాల ప్రణాళికపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. తూర్పు లద్దాఖ్​లో వాస్తవాధిన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించే విధంగా ఈ ప్రణాళికలు ఉన్నట్లు ఇరు దేశాల విదేశాంగ శాఖలు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఉభయ వర్గాలకు మంచిదికాదని చైనా సైతం అంగీకరించింది. ఎల్‌ఏసీ నుంచి రెండు దేశాల సైన్యాలు సమదూరం పాటించాలని నిర్ణయించాయి. సరిహద్దు వివాదంపై పరస్పరం చర్చలు కొనసాగించేందుకు అంగీకరించారు ఇరువురు నేతలు.

రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్​సీఓ) సదస్సు విరామంలో సమావేశమైన ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వివాదం ఇలా..

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి భారత్-చైనా బలగాలు మే నుంచి స్టాండ్​ ఆఫ్ పాటిస్తున్నాయి. జూన్​లో గల్వాన్​లోయలో జరిగిన హింసాత్మక ఘటన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. మళ్లీ ఇటీవల హెచ్చరిక కాల్పులు కూడా ఉద్రిక్తతలకు దారి తీశాయి.

చైనా తీరుపై భారత్​ అభ్యంతరం..

ఇరువురు విదేశాంగ మంత్రుల సమావేశంలో.. సరిహద్దు వెంట చైనా భారీ స్థాయిలో బలగాల్ని మోహరిస్తుండడం పట్ల భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు సైనికులు, ఆయుధాల్ని సరిహద్దులకు చేరుస్తుండడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) సరిహద్దుల్లో అవలంబిస్తున్న దురుసు వైఖరి పట్ల భారత్‌ అభ్యంతరం తెలిపింది. సరిహద్దుల విషయంలో ఇరు దేశాల మధ్య 1993, 1996లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టం చేసింది. సరిహద్దు నిర్వహణ విషయంలో కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో భారత్‌ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టం చేసింది.

ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఎంతో కీలకమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు. అలా అయితేనే ద్వైపాక్షిక బంధం సాఫీగా ముందుకు సాగుతుందని తెలిపారు. లద్దాఖ్‌లో నెలకొన్న పరిస్థితులతో ఇప్పటికే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు నెలకొన్న అన్ని ప్రాంతాల నుంచి వెంటనే బలగాల్ని ఉపసంహరించాలని జైశంకర్‌ తేల్చి చెప్పారు. అలా అయితేనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉంటాయని వివరించారు. చివరగా శాశ్వత స్థావరాలకు తమ బలగాల్ని తరలించే ప్రక్రియను మిలిటరీ కమాండర్లే ఖరారు చేయాలని ఉభయులూ నిర్ణయించారు

ఇవీ చూడండి:

లద్దాఖ్​లో శాంతిని నెలకొల్పడం ఎలా?

ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా చైనా దుశ్చర్యలు?

చైనా సెల్ఫ్​ గోల్- 45 ఏళ్ల తర్వాత పేలిన తూటా

Last Updated : Sep 11, 2020, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.