ETV Bharat / international

ఫోన్ చర్చల్లో మోదీ, పుతిన్​ స్నేహగీతం - రష్యా

భారత్​-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా.. ఫోన్​లో సంభాషించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. మోదీ కూడా అదే రీతిలో స్పందించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

In telephonic talks, Modi, Putin resolve to further strengthen ties
'భారత్​-రష్యా సంబంధం మరింత బలోపేతం చేద్దాం'
author img

By

Published : Sep 18, 2020, 4:07 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా గురువారం శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

సెప్టెంబర్​ 17న మోదీ పుట్టినరోజు సందర్భంగా నేతలు ఇద్దరూ ఫోన్​లో సంభాషించుకున్నట్లు పేర్కొంది విదేశాంగ శాఖ. భారత ప్రధానికి పుతిన్​ శుభాకాంక్షలు చెప్పారని.. ప్రతిగా మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల్లో పుతిన్​ నిబద్ధతపై మోదీ సంతోషం వ్యక్తం చేశారని, భారత్​-రష్యా శిఖరాగ్ర సమావేశాలకు ఆయనను స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారని స్పష్టం చేసింది ఎంఈఏ.

''భారత్​-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని మోదీ, పుతిన్​ పునరుద్ఘాటించారు. కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలపై నిరంతరం శ్రద్ధ చూపుతున్నందుకు పరస్పరం ప్రశంసించుకున్నారు.''

- భారత విదేశాంగ శాఖ

భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్​.. రష్యా పర్యటనల గురించీ ఇరువురు నేతలు ఫోన్​ కాల్​లో ప్రస్తావించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

షాంఘై సహకార సదస్సు(ఎస్​సీఓ) కోసం ఇటీవల వేర్వేరుగా రష్యా వెళ్లారు రాజ్​నాథ్​, జైశంకర్​. అక్కడి ప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపారు. రష్యా వ్యాక్సిన్​ స్పుత్నిక్​-వి ఉత్పత్తి, భారత్​లో క్లినికల్​ ట్రయల్స్​కు సంబంధించి ఇప్పటికే ఇరుదేశాలు సంప్రదింపులు జరిపాయి.

ఇవీ చూడండి:

మధ్యవర్తిత్వం: రష్యా చొరవతో కొత్త పంచశీల?

టీకా ఉత్పత్తిపై భారత్​తో రష్యా సంప్రదింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.