రష్యాలో ఓ భారీ స్కాం బయటపడింది. అనేక మంది ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఇందులో భాగమైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే దర్యాప్తు బృందాలు.. ఓ ఉన్నతాధికారి ఇంటికి సోదాలకు వెళ్లినప్పుడు బయటపడిన కొన్ని దృశ్యాలు అందరిని అవాక్కయ్యేలా చేశాయి. వాటిలో ఒకటి అధికారి ఇంట్లో ఉండే మరుగుదొడ్డి. ఆ వ్యక్తి లావెర్ట్రీ సీట్‌ను బంగారంతో కట్టించుకున్నాడు. అంతేగాక దాని ఫ్లోర్‌ను కూడా మ్యాచింగ్‌గా ఉండేలా ప్రత్యేక మార్బుల్‌తో పరిపించాడు. దీనిని చూసిన దర్యాప్తు బృందం ఒక్కసారిగా కంగుతింది. ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి పేరు కల్నల్ అలెక్సీ సఫోనోవ్.
ఇల్లంతా బంగారమే..
నైరుతి రష్యాలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న స్టావ్రోపోల్లో అలెక్సీకి భూతల స్వర్గాన్ని తలపించే ఇల్లు ఉంది. ఇంటి ముందు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇంట్లో ఉండే ఫర్నీచర్, గోడకు ఉండే ఫ్రేమ్‌లు, కిచెన్‌లో ఉండే అరమరాలు, మిగతా వస్తువులు, పిల్లలు అడుకునే బొమ్మలు, ఇతర సామాగ్రి అంతా బంగారంతో ధగధగలాడుతున్నాయి. అంతేకాకుండా ఇంటీరీయర్ డెకరేషన్ అంతా పుత్తడితోనే ఉండడం గమనార్హం.
యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న వీడియో..
దర్యాప్తు బృందం ఆ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన వీడియో యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. దీనిని అధికారులు జులై 20న ఆప్‌లోడ్ చేశారు. దీని నిడివి 49 సెకెన్లు. అయితే ఇప్పటివరకు ఈ వీడియోకు 3.45 లక్షల మంది చూశారు. ఇది చూసిన వారంత ప్రస్తుతం రియల్ఎస్టేట్ వాళ్లు ఇచ్చే వ్యాపార ప్రకటనలా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను మీరు చూడడం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కేసు ఏంటి..
ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం అలెక్సీ, అతని కింద ఉండే ఆరుగురు అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని వాహనాలకు ఫేక్ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయా వాహనాలు స్టావ్పోల్లో ఎటువంటి రుసుము చెల్లించకుండా సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలో వారు భారీగా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. అదే కేసులో మరో 35 మంది హస్తం ఉందనే అనుమానులు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ కోసం వెళ్లిన పోలీసులు.. ఆ ఇంటిని చూసి షాక్ అయ్యారు.
అయితే ఈ ఆరోపణలు రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలుశిక్ష పడుతుందని స్థానికి మీడియోలో కథనాలు వచ్చాయి.
ఇదీ చూడండి: అంతరిక్ష పర్యటనపై ఆసక్తా? ఇది మీకోసమే..