ETV Bharat / international

చైనాలో మరిన్ని ప్రాంతాలకు డెల్టా ముప్పు

చైనాలో మరిన్ని ప్రాంతాలకు డెల్టా వేరియంట్​ విస్తరించే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య కమిషన్​ హెచ్చరించింది. జియాంగ్సు ప్రావిన్స్‌లోని నన్‌జింగ్‌ నగరంలో తొలిసారి డెల్టా రకాన్ని అధికారులు గుర్తించారు.

delta variant in china, china delta variant
చైనాలో మరిన్ని ప్రాంతాలకు డెల్టా ముప్పు
author img

By

Published : Aug 1, 2021, 6:09 AM IST

ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ డెల్టా రకం చైనాలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ హెచ్చరించింది. జియాంగ్సు ప్రావిన్స్‌లోని నన్‌జింగ్‌ నగరంలో తొలిసారి డెల్టా రకాన్ని గుర్తించారు. ఇక్కడి విమానాశ్రయ సిబ్బందికి వైరస్‌ సోకగా.. ఈ రకం బయటపడింది. ఇది మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని జాతీయ ఆరోగ్య మిషన్‌ సీనియర్‌ అధికారి హీ కింగ్‌ హువా పేర్కొన్నారు.

నన్‌జింగ్‌ విమానాశ్రయంలో రష్యా నుంచి వచ్చిన ఓ విమానాన్ని శుభ్రపరిచే సిబ్బంది ద్వారా డెల్టా వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో నిత్యం వేసవి పర్యటకులతో కిటకిటలాడే విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. మరోవైపు ప్రముఖ పర్యటక కేంద్రం రూంగ్‌జియాజీలోని అన్ని ప్రాంతాలను మూసివేశారు. 11 పొరుగు ప్రాంతాలను మధ్యస్థ స్థాయి ముప్పు ఉన్నవిగా ప్రకటించారు.

అమెరికాలో 99 వేల కేసులు..

అమెరికాలోనూ కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. శుక్రవారం నాడు 98 వేలకు పైగా కొత్త కేసులు బయట పడ్డాయి. వరల్డో మీటర్‌ గణాంకాల ప్రకారం పిబ్రవరి 12 తర్వాత ఇన్ని ఎక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి : 'అదుపు చేయకుంటే మరింత ప్రమాదకర వేరియంట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.