ETV Bharat / international

జిన్​పింగ్​ను విమర్శించిన నేతకు 18 ఏళ్ల జైలు - రెన్ ఝింకియాంగ్ జైలు శిక్ష

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​పై విమర్శలు చేసిన అధికార పార్టీ మాజీ సభ్యుడు రెన్ ఝింగియాంగ్​కు అక్కడి కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అవినీతి, లంచగొండితనం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణల్లో ఆయనను దోషిగా తేల్చింది. కరోనాపై జిన్​పింగ్ ప్రభుత్వం నిజాలు దాస్తోందంటూ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు రెన్.

Critic of Chinese leader sentenced to 18 years in graft case
జిన్​పింగ్​ను విమర్శించిన నేతకు 18 ఏళ్ల శిక్ష
author img

By

Published : Sep 22, 2020, 4:13 PM IST

కరోనా నిర్వహణలో విఫలమయ్యారని చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​పై విమర్శలు చేసిన ప్రభుత్వ రియల్ ఎస్టేట్ కంపెనీ మాజీ ఛైర్మన్ రెన్ ఝింకియాంగ్​కు అక్కడి న్యాయ స్థానం 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అవినీతి కేసులో ఈ శిక్ష ఖరారు చేసింది.

అవినీతితో పాటు, లంచగొండితనం, ప్రభుత్వ నిధుల అపహరణ, అధికార దుర్వినియోగం వంటి అభియోగాల్లో రెన్​ను దోషిగా తేల్చింది అక్కడి ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు. ఈ నిర్ణయాన్ని న్యాయస్థానం తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ప్రకటించింది. ఈ తీర్పును రెన్ అప్పీల్ చేయడం లేదని పేర్కొంది.

విమర్శించి.. విరోధిగా మారి!

కరోనా విలయం, సెన్సార్​షిప్ సహా పలు కీలకమైన అంశాలపై తన అభిప్రాయాలను రెన్ ఝింకియాంగ్ నిక్కచ్చిగా చెప్పేవారు. డిసెంబర్​లో వుహాన్ కేంద్రంగా ప్రారంభమైన కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని జిన్​పింగ్​పై ఆరోపణలు చేశారు. దీనిపై మార్చిలో ఓ వ్యాసం రాశారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియలేదు. అధికార పక్ష సభ్యుడైన రెన్​ను జులైలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ఫిబ్రవరిలో షీ జిన్​పింగ్ లక్షా 70 వేల మంది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. దీనిపై రెన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వ్యాధి ఎక్కడ ప్రారంభమైందో అనే సమాచారాన్ని అణచివేసి.. ప్రజలను కాపాడుతున్నామని నాయకులు తమను తాము చిత్రీకరించుకుంటున్నారని విమర్శించారు.

"నిజం ఏంటన్న విషయంపై కాన్ఫరెన్స్​లో దర్యాప్తు జరగలేదు, వాటిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరూ బాధ్యత తీసుకోలేదు. తమ గొప్ప విజయాలతో నిజాన్ని దాచేందుకు ప్రయత్నిస్తున్నారు."

-రెన్ ఝింకియాంగ్

గతంలో రెన్ సైన్యంలో పనిచేశారు. తన తల్లితండ్రులు ఇద్దరు కూడా కమ్యునిస్టు పార్టీలో మాజీ ఉన్నతాధికారులు. కమ్యునిస్టు పార్టీ వ్యవస్థాపకుల సంతానాన్ని సూచించే 'ప్రిన్సెలింగ్' పేరుతో రెన్​ను పిలిచేవారు.

విమర్శకులకు ఇదే సమాధానం!

2012 నుంచి కమ్యునిస్టు పార్టీని ఏలుతున్న షీ జిన్​పింగ్.. తనపై వచ్చిన విమర్శలను ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. వందలాది మంది జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను జైళ్లలో నిర్బంధించారు. అనధికార ఆర్గనైజేషన్లను రద్దు చేసి.. సెన్సార్​షిప్​ను కఠినతరం చేశారు. జిన్​పింగ్ నాయకత్వాన్ని విమర్శించి చైనాలో రాజకీయ నియంత్రణ రేఖను రెన్ అతిక్రమించారని విశ్లేషకులు అంటున్నారు.

ఇదీ చదవండి-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.