ETV Bharat / international

ఆ కరోనా వ్యాక్సిన్​ ధర రూ.4,399..!

ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్​ కోసం ఎదురుచూస్తున్న వేళ చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి చెందిన సినోవాక్​ టీకాను అత్వవసర వినియోగం కోసం ఓ పట్టణంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్​ రెండు డోసుల ధరను 60 డాలర్లుగా నిర్ణయించింది.

coronavirus vaccine
ఆ కరోనా వ్యాక్సిన్​ ధర రూ.4,399..!
author img

By

Published : Oct 16, 2020, 5:13 PM IST

చైనాకు చెందిన సినోవాక్‌ టీకాను అత్యవసర వినియోగం కోసం ఆ దేశంలోని ఓ పట్టణంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ టీకా రెండు డోసుల ధర 60 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.4,399. ఈ విషయాన్ని జియాషిన్‌ నగరంలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వుయ్‌చాట్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒక్కో వయల్‌ 29.75 డాలర్లకు విక్రయిస్తున్నారు. మొత్తం రెండు డోసులు తీసుకోవాలి. హైరిస్క్ గ్రూప్‌లోని వైద్యులు, సిబ్బందికి దీనిని ఇస్తున్నారు.

కరోనా కట్టడి కోసం జులై నుంచే అత్యవసర టీకా వినియోగాన్ని ప్రారంభించింది చైనా. ఈ టీకా ధరను ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం వుయ్‌చాట్‌లో విడుదల చేసిన ధరలో కూడా సబ్సిడీలు కలిసి ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టతలేదు. దీనిపై ఆ పట్టణ సీడీసీ వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. టీకా తయారీ సంస్థ సినోవాక్‌ కూడా ధరపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇటీవల ఇండోనేషియాకు చెందిన బయోఫార్మా కంపెనీ 40 మిలియన్‌ డోసుల కోసం సినోవాక్‌ను సంప్రదించింది. ఆ సమయంలో ఇండోనేషియా సంస్థ కొన్ని వివరాలను వెల్లడించింది. తమ దేశంలో ఆ టీకా అందుబాటులోకి వచ్చేసరికి ఒక్కో వయల్‌ 13.60 డాలర్లు పడుతుందని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.