ఇరాన్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 66 మంది చనిపోగా.. 2,392 మందికి కొత్తగా వైరస్ సోకింది. అయితే 10వేల మంది హెల్త్‌కేర్ వర్కర్లు కొవిడ్-19 బారిన పడినట్లు గురువారం కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.
లెక్కలు దాస్తోందా..!
గత వారం ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. 800 మంది ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే కరోనా బారినపడ్డారు. 100మంది చనిపోయారు. కానీ ప్రభుత్వం లెక్కలు దాస్తోందని కథనాలు రావడం ప్రస్తుతం ఆ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇరాన్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,249కి చేరగా.. 1,29,000మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. పశ్చిమాసియాలోనే అత్యధిక మరణాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది ఇరాన్.