ETV Bharat / international

ప్రపంచ వింత.. 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ! - చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్​ నిద్రపోని మహిళ

మనిషికి అత్యంత ముఖ్యమైన వాటిలో నిద్ర ఒకటి. ఒక్కరోజు నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. కానీ ఓ మహిళ ఒకరోజు, రెండ్రోజులు కాదు.. ఏకంగా 40 ఏళ్లుగా నిద్రపోవట్లేదంటే నమ్మగలరా? ఈ వింత కేసు చైనాలో వెలుగులోకి వచ్చింది. దీనిపై వైద్యుల బృందం పరిశోధనలు జరిపి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అవేంటో మీరూ చదివేయండి మరి..

లీ-జాన్​ఇంగ్
లీ-జాన్​ఇంగ్
author img

By

Published : Sep 4, 2021, 2:01 PM IST

చైనాకు చెందిన ఓ మహిళ గత 40 ఏళ్లలో ఒక్కసారి కూడా నిద్రపోలేదని పేర్కొంది. నాలుగు దశాబ్దాలుగా నిద్రంటే ఏంటో తెలియదని.. అయినప్పటికీ అలసటగా అనిపించట్లేదని తెలిపింది.

హెనాన్ ప్రావిన్స్‌ జాంగ్‌మౌ కౌంటీలోని ఓ గ్రామానికి చెందిన లీ-జాన్​ఇంగ్ అనే మహిళ 40 ఏళ్లు నిద్రపోవడం లేదు. ఈ విషయాన్ని ఆమె భర్త, ఇరుగుపొరుగు వారు సైతం ధ్రువీకరించడం విశేషం. తాను చివరిసారి 5-6 సంవత్సరాల వయస్సులో నిద్రపోవడం గుర్తుందని.. గడచిన 40 ఏళ్లలో ఒక్కసారి కూడా నిద్ర పోలేదని లీ పేర్కొంది. ఇంతవరకూ బాగానే ఉన్నా అసలు సాధారణ మనుషుల్లా ఆమె నిద్ర పోకపోవడానికి కారణాలేంటి అని తెలుసుకోవడానికి వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

లీ-జాన్​ఇంగ్ భర్త లియు సుక్విన్ కూడా తన భార్యకు ఎలాంటి నిద్ర అవసరం లేదని చెప్పారు.

"మా వివాహం జరిగినప్పటి నుంచి నా భార్య రాత్రి-పగలు మేల్కొనే ఉంటోంది. ఆమెకు నిద్ర పట్టడం లేదని చెబుతూనే ఉంది. ఆమెకోసం కొన్ని నిద్రమాత్రలు కూడా కొన్నా. కానీ లాభం లేదు."

-లీ జాన్​ఇంగ్ భర్త లియు సుక్విన్

తాను చాలాసార్లు వైద్యుల్ని సంప్రదించినప్పటికీ తన సమస్య పరిష్కారం కాలేదని లీ-జాన్​ఇంగ్ తెలిపింది. అయితే ఇటీవల బీజింగ్‌ ఆసుపత్రి వైద్యులు మాత్రం ఆమె నిద్ర లేమికి గల రహస్యాన్ని ఛేదించారు. ఆ మహిళను 48 గంటల పాటు తమ పర్యవేక్షణలో ఉంచిన వైద్యబృందం.. అధునాతన సెన్సార్‌లను ఉపయోగించి ఆమె మెదడులోని సమాచారాన్ని సేకరించారు. ఆమె శరీరం, మెదడు విశ్రాంతి తీసుకునే విధానం అసాధారణంగా ఉంటుందని.. ఈ కారణంగానే 40 ఏళ్లుగా నిద్రపోలేదని ఆమె నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

లీ-జాన్​ఇంగ్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీ-జాన్​ఇంగ్

"లీ సాధారణమైన వ్యక్తుల మాదిరి కాకుండా.. తేలికగా, మితంగా నిద్రపోతోంది. దీనిని మేల్కొని నిద్రపోవడం అనొచ్చు. ఒక రకంగా స్లీప్‌వాకింగ్‌తో సమానమైన స్థితి. నిజానికి ఆమె మెదడు ఆమెను మోసం చేస్తోంది. విశ్రాంతి తీసుకుంటున్న విషయం ఆమెకు తెలియదు. ఆమె శరీరంలో కొంత భాగం ఇప్పటికే నిద్రాణస్థితికి చేరుకుంది. ఆమె కొన్నిసార్లు నెమ్మదిగా కనురెప్పలు స్వల్పంగా మూసి ఉంచేది. దీనిని ఆమె విశ్రాంతి తీసుకుంటున్న సమయంగా పేర్కొనవచ్చు."

-వైద్యబృందం డేటా

అయితే ఒకరోజులో 10 నిమిషాలకు మించి కళ్లు మూసుకుని గడపదు కాబట్టి సాంకేతికంగా ఇది సరైనదేనని.. ఆమె అలా అనుకోవడంలో తప్పులేదని వైద్యులు వివరించారు.

సెలబ్రిటీగా..

ఇక పగలు-రాత్రి అనే తేడా లేకుండా మేల్కొని ఉండగల సామర్థ్యం కలిగిన ఆమె స్థానికంగా సెలెబ్రిటీగా మారింది. ఆమె చెబుతున్న అంశాన్ని నమ్మని కొందరు స్థానికులు రాత్రంతా పేకాట ఆడాలని సవాలు విసిరారు. కానీ 'చివరికి వారంతా నిద్రలోకి జారుకున్నారని.. తాను మాత్రం అలానే ఉండిపోయినట్లు' ఆ మహిళ గుర్తుచేసుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.