ETV Bharat / international

అమెరికా వల్లే ప్రపంచ శాంతికి ముప్పు: చైనా - చైనా మిలిటరీ

చైనా సైనిక ఆశయాలపై అమెరికా ఇటీవలే ఓ నివేదికను రూపొందించింది. అయితే ఈ విషయంపై చైనా ఎదురుదాడికి దిగింది. వాస్తవానికి అమెరికాతోనే ప్రపంచ శాంతికి ముప్పుపొంచి ఉందని ఆరోపించింది. తమ సైన్యంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది.

Chinese military calls US biggest threat to world peace
అమెరికా వల్లే ప్రపంచ శాంతికి ముప్పు: చైనా
author img

By

Published : Sep 13, 2020, 6:00 PM IST

అమెరికా- చైనా మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా.. తమ సైనిక లక్ష్యాలపై అమెరికా రూపొందించిన నివేదికను చైనా తప్పుబట్టింది. తమ వల్ల ప్రపంచానికి ఎలాంటి నష్టంలేదని.. వాస్తవానికి అమెరికానే అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని ఆరోపించింది. అగ్రరాజ్యం వల్ల ప్రపంచ శాంతికి ముప్పుపొంచి ఉందని ఆరోపించింది.

చైనా సైనిక ఆశయాలు.. తమ దేశ జాతీయ భద్రతకు, అంతర్జాతీయ నిబంధనలకు తీవ్ర ప్రమాదమని.. కాంగ్రెస్​కు సమర్పించిన నివేదికలో అగ్రరాజ్య రక్షణశాఖ పేర్కొంది. ఈ నివేదికతో తమపై అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని మండిపడింది చైనా.

"అమెరికా అనిశ్చితిని సృష్టిస్తుంది, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది, ప్రపంచ శాంతిని నాశనం చేస్తుంది. వీటికి ఎన్నో ఆధారాలున్నాయి. ఇరాక్​, సిరియా, లిబియాతో పాటు అనేక దేశాల్లో అమెరికా చర్యల వల్ల 8 లక్షల మందికిపైగా మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. తమను తాము పరిశీలించుకోకుండా.. చైనాపై తప్పుడు నివేదికలను రూపొందించింది అగ్రరాజ్యం. అసత్య ఆరోపణలు చేయడం మాని.. చైనా సైన్యాన్ని హేతుబద్ధంగా చూడాలని అమెరికాకు సూచిస్తున్నాం. ఇరు దేశాల ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం."

--- వూ కియాన్​, చైనా రక్షణశాఖ ప్రతినిధి.

ఈ 150 పేజీల నివేదికలో... చైనా పీఎల్​ఏ సాంకేతిక సామర్థ్యం, చైనా మిలిటరీ అంతిమ లక్ష్యాలను అమెరికా క్షుణ్నంగా పరిశీలించింది. అంతర్జాతీయ నిబంధనలకు ఇవి ప్రమాదం కలిగిస్తాయమని పేర్కొంది.

వాణిజ్య యుద్ధం, కరోనా వైరస్​, హాంగ్​కాంగ్​ వివాదం, దక్షిణ చైనా సముద్రంలో అలజడులు వంటి సమస్యలతో అమెరికా- చైనా దేశాల మధ్య బంధం ఇప్పటికే దెబ్బతింది. ఈ నేపథ్యంలో అమెరికా నివేదికతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోమారు పెరిగాయి.

ఇదీ చూడండి- చైనా కుటిల వ్యూహం: ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.