ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి వైదొలగాలని అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని చైనా తప్పుపట్టింది. ఈ చర్య అమెరికా ఏకపక్షవాదానికి నిదర్శనమని విమర్శించింది.
కరోనా వైరస్ మూలాలు తెలుసుకునేందుకుగాను డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం.. చైనాలో పర్యటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాపై బీజింగ్ విమర్శలు గుప్పించింది.
"అంతర్జాతీయ కూటముల నుంచి, ఒప్పందాల నుంచి అర్థాంతరంగా వైదొలగడం అమెరికాకు మామూలే. తాజాగా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం ఆ దేశ ఏకపక్షవాదానికి నిదర్శనం."
- జావో లీజియన్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ఇలా మొదలైంది
గతేడాది చివర్లో చైనాలోని వుహాన్లో కరోనా కేసులు మొదలయ్యాయి. అయితే చైనాగానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ... మిగతా ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో విఫలమయ్యాయని అమెరికా విమర్శించింది. దీనితో చైనా కూడా అగ్రరాజ్యంపై ప్రతివిమర్శలు చేసింది. ఇవి ఇంకా కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: భారత్తో నేపాల్ మరో కయ్యం- బోర్డు పెట్టి మరీ...