ETV Bharat / international

తాలిబన్ల 'వేడుక'కు చైనాకు ఆహ్వానం! - తాలిబన్​ వార్తలు

అఫ్గాన్​లో తాలిబన్ల ప్రభుత్వం త్వరలో అధికారికంగా కొలువుదీరనుంది. ఈ వేడుకలకు హాజరుకావాలని చైనాకు(china taliban support) ఆహ్వానం అందినట్టు సమాచారం. ఈ విషయాన్ని చైనా ఖండించకపోగా, ఆ దేశ విదేశాంగ ప్రతినిధి దాట వేసే ప్రయత్నం చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.

taliban
చైనా- తాలిబన్​
author img

By

Published : Sep 6, 2021, 4:10 PM IST

Updated : Sep 6, 2021, 4:48 PM IST

అమెరికా వైదొలిగిన అనంతరం అఫ్గాన్​పై పట్టుసాధించేందుకు చైనా(china taliban support) విశ్వప్రయత్నాలు చేస్తోంది. అక్కడి ఖనిజాలపై కన్నేసిన చైనా.. తాలిబన్లతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోంది. తాజాగా.. చైనా- తాలిబన్ల మైత్రికి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. త్వరలో తాలిబన్లు ప్రభుత్వాన్ని(taliban news today) ఏర్పాటు చేయనుండగా.. ఆ వేడుకలో పాల్గొనాల్సిందిగా చైనాకు ఆహ్వానం లభించిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని చైనా ఖండించకపోవడం వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది.

చైనాతో పాటు పాకిస్థాన్​, టర్కీ, రష్యా, ఇరాన్​, ఖతార్​కు ఆహ్వానం అందినట్టు సమాచారం. ఇదే విషయాన్ని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్​ వెంబిన్​ను మీడియా సభ్యులు అడగ్గా.. తన వద్ద సమాచారం లేదని ఆయన దాట వేసే ప్రయత్నం చేశారు.

"పొరుగు దేశాలతో సఖ్యతగా ఉండే, విదేశాంగ విధానాలను గౌరవించే సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటులో అఫ్గానిస్థాన్​కు చైనా కచ్చితంగా మద్దతిస్తుంది. అయితే తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు వేడుకకు చైనాకు ఆహ్వానం లభించిందా? అన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు."

-- వాంగ్​ వెంబిన్​, చైనా విదేశాంగశాఖ ప్రతినిధి.

రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్​కు పెద్దన్నగా వ్యవహరించి.. ఉగ్రవాదంపై సుదీర్ఘ పోరాటం చేసింది అమెరికా. కానీ ఒక్కసారిగా తమ బలగాలను పూర్తిస్థాయిలో ఉపసంహరించుకుని(america evacuation).. అఫ్గాన్​ సంక్షోభానికి తెరతీసింది. అమెరికా వెనుదిరగడాన్ని అవకాశంగా చూసిన చైనా.. ఇప్పుడు అఫ్గాన్​పై పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధపడుతోంది(china afghanistan). అగ్రరాజ్యం వైదొలిగిన అనంతరం ఏర్పడిన ఖాళీని చైనా భర్తీ చేయాలని యోచిస్తోంది. మధ్య ఆసియాలో ఆధిపత్యం చలాయించాలనే తన కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.

అమెరికా బలగాలు వెళ్లిపోయిన తర్వాత తాలిబన్​ సేనలు కాబుల్​ విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఆ తర్వత మొదటగా తాలిబన్లకు అనుకూలంగా ప్రకటన చేసింది చైనానే. తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అది జరిగిన కొద్ది రోజులకే చైనా తాలిబన్లతో బహిరంగ చర్చలు మొదలుపెట్టింది. కాబుల్​లో తన రాయబార కార్యాలయాన్ని ఇందుకు ఉపయోగించుకుంది. తాలిబన్లకు మద్దతుగా అనేక ప్రకటనలు చేసింది. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో పాశ్చాత్య దేశాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కానీ తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో చైనా, దాని మిత్ర దేశం పాకిస్థాన్​ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాయి!

అటు తాలిబన్లు కూడా చైనాతో మైత్రి కోసం ఉవ్విళ్లూరుతున్నారు. చైనా తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా(taliban china connection) పేర్కొన్నారు. అఫ్గాన్​(Afghan Taliban)​ పునర్నిర్మాణం కోసం, ఆర్థికంగా చితికిపోయి, ఆకలి కేకల్లో చిక్కుకున్న దేశాన్ని బయటపడేసేందుకు చైనా వైపు చూస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:- Afghan news: అఫ్గాన్‌ సంపదపై డ్రాగన్‌ కన్ను.. తాలిబన్లతో మంతనాలు!

Last Updated : Sep 6, 2021, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.