ETV Bharat / international

బైడెన్​కు చైనా అభినందనలు చెప్పదా? - china greetings strategy

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విస్పష్టమైన మెజారిటీ సాధించారు జో బైడెన్​. ఇప్పటికే ప్రపంచస్థాయి నేతలు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ చైనా మాత్రం అటువంటి ఊసే లేకుండా ఉంది. అయితే దీనిపై ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి స్పందిచారు. అధికారికంగా ఫలితాలు వెల్లడించే వరకు ఎటువంటి కామెంట్స్​ చేసేది లేదని తేల్చిచెప్పారు.

China holding off sending congratulations in US election
అధికారికంగా బైడెన్​ గెలిచాకే అభినందనలు: చైనా
author img

By

Published : Nov 9, 2020, 5:45 PM IST

అమెరికా అధ్యక్ష పోరులో బైడెన్​ నెగ్గినా అధికారికంగా ఫలితం వెల్లడించే వరకు తాము ఎటువంటి అభినందన సందేశాలు పంపేది లేదని చైనా స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్​ వెన్​బిన్​ వెల్లడించారు. ఎన్నికల ఫలితం ఆ దేశ చట్టాల ప్రకారం నిర్ణయించుతారని, ఈ విషయంలో మేము అంతర్జాతీయ పద్ధతులను అనుసరిస్తామని తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్​ విజయం సాధించారు. కానీ ఆ దేశ చట్టాల ప్రకారం ఇంకా ఆయన గెలుపు ఇంకా ధ్రువీకరించలేదు. ఇతర దేశాల రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చడం చైనా విధానం కాదు. అమెరికా, చైనా మధ్య ఉన్న విభేదాలను పరస్పర గౌరవంతో పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.

-వాంగ్​ వెన్​బిన్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

ఇదీ చూడండి: బైడెన్-కమల సర్కార్​ తొలి ప్రాధాన్యం వీటికే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.