జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే టోక్యోలోని కీయో విశ్వవిద్యాలయం ఆస్పత్రికి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా... 65 ఏళ్ల అబే ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
కొంత కాలం నుంచే...
అబే ఆరోగ్యం బాగాలేదని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఊహాగానాలన్నింటినీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది.
అబేకు కాస్త విశ్రాంతి అవసరమని జపాన్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి అకీరా అమారీ ఆదివారం వ్యాఖ్యానించారు. కొద్ది గంటలకే ప్రధాని ఆస్పత్రిలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2006 సెప్టెంబర్లో తొలిసారి జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు షింజో అబే. 2007లో తీవ్ర అనారోగ్యం కారణంగా ఆ పదవి నుంచి అర్ధంతరంగా వైదొలిగారు.
ఇదీ చూడండి: క్యూ2లో 7.8 శాతం పతనమైన జపాన్ జీడీపీ