ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా లాక్​డౌన్.. ఇళ్లల్లోనే 170 కోట్లమంది! - Around 20% of global population under coronavirus lockdown

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా దేశాలు లాక్​డౌన్​నే ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 170 కోట్ల మంది ప్రజానీకం ఇళ్లకే పరిమితమయినట్లు ఓ గణాంక సంస్థ వెల్లడించింది. వైరస్ నియంత్రణ కోసం కట్టుదిట్టమైన ఆంక్షలను అమలుచేస్తున్నాయి.

150 crores told to stay home worldwide over virus
ప్రపంచవ్యాప్తంగా లాక్​డౌన్.. ఇళ్లల్లోనే 170 కోట్లమంది!
author img

By

Published : Mar 24, 2020, 4:14 PM IST

ప్రస్తుత వేగవంతమైన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఎటూ కదలకుండా చేసింది కరోనా వైరస్​. స్వేచ్ఛగా, యథేచ్ఛగా తిరిగే మానవాళి కాళ్లకు కళ్లెం వేసి.. ప్రపంచ ధోరణినే మార్చేసింది. ఆయా దేశాల్లోని 170 కోట్ల మందిని ఇళ్లకే పరిమితం చేసింది. ఈ మేరకు ఓ గణాంక సంస్థ నివేదికలో తెలిపింది.

యాభై దేశాల ప్రభుత్వాలు కరోనా లాక్​డౌన్​ను అమలు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పోరాడుతున్నాయి. పాక్షిక లాక్​డౌన్​, దేశవ్యాప్త కర్ఫ్యూలతో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ఫ్రాన్స్​, ఇటలీ, అర్జెంటీనా, కాలిఫోర్నియా, ఇరాక్​, రువాండా సహా.. దాదాపు 34 దేశాలు పూర్తి బంద్ ప్రకటించాయి. ఈ దేశాల్లోని సుమారు 65 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జర్మనీ, బ్రిటన్​, ఇరాన్​ దేశాలు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. దాదాపు 10 దేశాలు పూర్తిగా కర్ఫ్యూ విధించాయి. మరికొన్ని ప్రభుత్వాలు స్వీయ నిర్బంధం దిశగా చర్యలు తీసుకున్నాయి..

రాకపోకలపై ఆంక్షలు..

ఎన్నో దేశాలు అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధించాయి. కొన్ని ప్రాంతాల్లో కనీసం నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు బయటకు రాలేకపోతున్నారు ప్రజలు.

భారత్​లో..

భారత్​లోని 560 జిల్లాల్లో లాక్​డౌన్​ అమల్లో ఉంది. ఈ జిల్లాల్లోని 70 కోట్ల మంది ప్రజలు గృహ నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి:చైనాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.