ETV Bharat / international

రైల్లోనే అత్యాచారం.. చూస్తూ ఉండిపోయిన ప్రయాణికులు! - రైల్లో రేప్

అందరూ చూస్తుండగా కదులుతున్న రైల్లోనే ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు ఓ దుండగుడు. ఈ సమయంలో తోటి ప్రయాణికులంతా చూస్తూ ఉండిపోయారని పోలీసులు చెప్పారు. కనీసం తమకు సమాచారం అందించే ప్రయత్నం కూడా చేయలేదని వాపోయారు.

SEXUAL ASSAULT
రైల్లోనే అత్యాచారం
author img

By

Published : Oct 17, 2021, 4:21 PM IST

ప్రయాణిస్తున్న రైల్లో మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు (Rape victim news). ఇతర ప్రయాణికులు చూస్తుండగానే దారుణానికి తెగబడ్డాడు. వీరంతా చూస్తూ ఉండిపోయారే తప్ప.. ఏమీ చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. అమెరికా ఫిలడెల్ఫియాలోని (Philadelphia news) అప్పర్ డార్బి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

రైలులో అనుమానాస్పద పరిస్థితులను గమనించి స్థానిక రైల్వే ఉద్యోగి పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు తర్వాతి స్టేషన్​లో వేచి చూశారు. మహిళను కాపాడి, నిందితుడిని అరెస్టు చేశారు. బుధవారం రాత్రి పది గంటలకు తమకు ఘటన గురించి సమాచారం అందిందని స్థానిక పోలీసు అధికారి తిమోతీ బెర్నార్డ్ తెలిపారు. (USA Philadelphia news)

"అక్కడ చాలా మంది ఉన్నారు. వారు ఈ ఘటనను అడ్డుకుంటే బాగుండేది. ఏదైనా చేసి ఉండాల్సింది. మనం సమాజంలో ఏ స్థితిలో ఉన్నామనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఇది చాలా ఇబ్బందికరమైనది. బాధిత మహిళ చాలా దృఢమైన వ్యక్తి. ఆమె.. పోలీసులకు మొత్తం వివరాలు చెప్పారు. ఆమె త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నా."

-తిమోతీ బెర్నార్డ్, పోలీసు అధికారి

ఘటన పూర్తిగా సీసీటీవీలో రికార్డైందని తిమోతీ తెలిపారు. చాలా మంది ప్రయాణికులు ఉన్నట్లు ఇందులో స్పష్టమవుతోందని చెప్పారు. నిందితుడిని ఫిస్టన్ నగాయ్​(35)గా గుర్తించారు.

ఘటనపై ఆగ్నేయ పెన్సిల్వేనియా రవాణా సంస్థ విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికుల్లో ఎవరైనా.. ముందుగానే పోలీసులకు సమాచారం అందించి ఉంటే ఘటనను ఆపే అవకాశం ఉండేదని అభిప్రాయపడింది.

ఇదీ చదవండి:

'టీకా వేయాలని ప్రయత్నిస్తే.. పాముతో కరిపిస్తా'

అత్త ఇంట్లో కోడలి 'దోపిడీ'.. సోదరుడితో కలిసి కోటి మాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.