ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​ ముందుగా అందేదెవరికి? - కోవిడ్​ 19

కరోనా వైరస్​పై పోరులో వ్యాక్సిన్​ ఎంతో కీలక పాత్ర పోషించనుందని అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే అనేక దేశాలు దీనిపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నాయి. మరి వ్యాక్సిన్​ కొనుగొన్న అనంతరం అది ముందుగా ఎవరికి అందుతుంది?

Who would be the first to get a COVID-19 vaccine?
కరోనా వ్యాక్సిన్​ ముందుగా అందేదెవరికి?
author img

By

Published : Jun 25, 2020, 3:46 PM IST

ఇప్పుడు ప్రపంచ దేశాల ఆశలన్నీ వ్యాక్సిన్​ పైనే. కరోనా సంక్షోభం నుంచి తమను గట్టెక్కించేది వ్యాక్సిన్​ ఒక్కటేనని ప్రజలు భావిస్తున్నారు. అనేక మంది శాస్త్రవేత్తలు.. కరోనాకు వ్యాక్సిన్​ను కనుగొనేందుకు ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ వ్యాక్సిన్​ను రూపొందించాక.. అది ముందుగా ఎవరికి అందుతుంది? అనే విషయంపై ఇప్పుడిప్పుడే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే.. ఏ దేశమైతే వ్యాక్సిన్​ను కనుగొంటుందో.. ఆ దేశ ప్రజలకే అది ముందుగా అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

లక్షల్లో ఆర్డర్లు...

బ్రిటన్​, చైనా, అమెరికా సహా వేర్వేరు దేశాలకు చెందిన డజనుకుపైగా సంస్థలు వ్యాక్సిన్​పై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)తో పాటు అమెరికా అలర్జీ, అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కూడా.. వచ్చే ఏడాది వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిశోధనలు ప్రయోగ దశలో ఉన్నప్పటికీ.. సంపన్న దేశాలు ఇప్పటికే లక్షల డోసులను ఆర్డర్​ ఇచ్చేశాయి.

ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్​ను ఆస్ట్రాజెనికా సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఇందులో బ్రిటన్​, అమెరికా దేశాలు పెట్టుబడులు పెట్టాయి. ఒకవేళ ఈ పరిశోధనలు విజయవంతమైతే.. బ్రిటన్​వాసులకే తొలి ప్రాధాన్యముంటుందని ఆ దేశ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. అమెరికా కూడా భారీ సంఖ్యలో ఆర్డర్లు ఇచ్చింది. అంతే కాకుండా ఇతర పరిశోధనలకూ సహకారం అందిస్తోంది.

మరి పేద దేశాల సంగతేంటి?

వ్యాక్సిన్​ పంపిణీలో ఉండే ఒత్తిడిని తట్టుకునే స్తోమత పేద దేశాల వద్ద ఉండదు. అందుకే వాటికి వ్యాక్సిన్​ డోసులను అందించడానికి గవీ(జీఏవీఐ) సహా పలు బృందాలు ముందుకొచ్చాయి.

భారత్​కు చెందిన సీరమ్​ ఇన్స్​టిట్యూట్​కు 1 బిలియన్​ డోసులు రూపొందించే విధంగా వ్యాక్సిన్​ లైసెన్సును ఇవ్వడానికి ఆస్ట్రాజెనికా అంగీకరించింది.

అంత సులభం కాదు...

వ్యాక్సిన్​ కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఒక వేళ వ్యాక్సిన్​ను కనుగొన్నా... దాన్ని పంపిణీ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ఎలాంటి అవకతవకలు లేకుండా వ్యాక్సిన్​ను పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది. అమెరికా కూడా ఇదే విధంగా స్పందిస్తూ.. ఓ వ్యవస్థను రూపొందిస్తున్నట్టు పేర్కొంది. ఆరోగ్యపరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి తొలుత వ్యాక్సిన్​ అందేలా చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.

ఇదీ చూడండి:- తుది దశకు ఆక్స్‌ఫర్డ్‌ టీకా- అక్టోబర్​లో రిలీజ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.