కరోనాతో సహజీవనం చేయాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ).. ఈ కొత్త జీవనశైలిలో ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. ఇలా చేస్తేనే కరోనా సంక్షోభం నుంచి ప్రపంచం గట్టెక్కుతుందని పేర్కొంది.
మహమ్మారి కారణంగా ఆసియా వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి చేరిందని ఆసియా అభివృద్ధి బ్యాంకుల సుస్థిర అభివృద్ధి- వాతావారణ మార్పుల విభాగం డైరెక్టర్ జనరల్ ఊచాంగ్ ఉమ్ తెలిపారు. మహమ్మారి కారణంగా ఈ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని వెల్లడించారు.
అయితే కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ పశ్చిమ పసిఫిక్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ తాకేశీ కాసై అన్నారు.
'వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నంత కాలం ఏ దేశం కూడా సురక్షితంగా ఉండదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేం నిరంతరం కృషిచేస్తూనే ఉంటాం. వైరస్ పెద్దయెత్తున సామాజిక వ్యాప్తిచెందే అవకాశమున్న తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలనూ సిద్ధం చేస్తున్నాం.'
- డాక్టర్ తాకేశీ కాసై, డబ్ల్యూహెచ్ఓ పశ్చిమ పసిఫిక్ రీజనల్ డైరెక్టర్
ఇదీ చదవండి: చైనాకు మరో షాక్- ఆ 2 సంస్థలపై అమెరికా బ్యాన్