ETV Bharat / international

'కరోనాపై పోరులో ప్లాస్మా చికిత్స 'ప్రయోగాత్మకమే'' - ప్లాస్మా థెరపీ

కరోనాపై పోరులో ప్లాస్మా చికిత్స వినియోగంపై డబ్ల్యూహెచ్​ఓ కీలక ప్రకటన చేసింది. ప్లాస్మా థెరపీని ఇంకా ప్రయోగాత్మక చికిత్సగానే పరిగణిస్తున్నట్టు వెల్లడించింది. మరిన్ని పరీక్షలు జరిపిన తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందని పేర్కొంది.

WHO says plasma therapy still 'experimental'
'కరోనాపై పోరులో ప్లాస్మా చికిత్స 'ప్రయోగాత్మకమే''
author img

By

Published : Aug 25, 2020, 5:08 AM IST

కరోనా బాధితులకు అందిస్తున్న ప్లాస్మా థెరపీని ఇంకా ప్రయోగాత్మక చికిత్సగానే పరిగణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించింది. వైరస్​పై ఈ చికిత్స పనిచేస్తుందన్న నివేదికలపై అస్పష్టత ఉందని పేర్కొంది. కరోన బారినపడ్డ వారికి ప్లాస్మా చికిత్సను అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అత్యవసర అనుమతులిచ్చిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

గత శతాబ్దంలో ఈ ప్లాస్మా చికిత్సను అనేక వ్యాధులపై వినియోగించారని.. కానీ దాని ఫలితాలు మిశ్రమంగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​ డా. సౌమ్య స్వామినాథన్​ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీని ఇంకా ప్రయోగాత్మక చికిత్సగానే పరిగణిస్తున్నట్టు.. దానిపై ఇంకా పరీక్షలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

యాంటీబాడీల స్థాయి ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుందని తెలిపారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్. అందువల్ల రికవరీ అయిన బాధితుల నుంచి ప్లాస్మాను సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ చికిత్సను ప్రామాణీకరించడం కష్టమని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:- పశ్చిమ పసిఫిక్ దేశాల్లో మరో దశకు కరోనా వ్యాప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.