ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓకు అమెరికా రాంరాం - డబ్ల్యూహెచ్​ఓకు అమెరికా రాంరాం

కరోనా మహమ్మారి విషయంలో కొద్ది రోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై విమర్శలు గుప్పిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక ప్రకటన చేశారు. డబ్ల్యూహెచ్​ఓతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వైరస్​ విషయంలో కీలక అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

US terminates relationship with  WHO
డబ్ల్యూహెచ్​ఓకు అమెరికా రాంరాం
author img

By

Published : May 30, 2020, 7:09 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ)తో తాము పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. వైరస్​ విషయంలో కీలక అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

ఈ మేరకు భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఆయన శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు ట్రంప్​. అమెరికా స్టాక్​ ఎక్స్చేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

డబ్ల్యూహెచ్​ఓకు ఇచ్చే నిధులను ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్​ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.