ETV Bharat / international

భారత్​లో తయారైన వయాగ్రా డ్రగ్స్ అమెరికాలో సీజ్​ - india viagra pills seized in us

వయాగ్రా తయారీలో వాడే కీలక ఔషధ మాత్రలను అమెరికాలో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వీటిని భారత్​లో తయారు చేశారని తెలుస్తోంది. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.5.30 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.

us drugs
అమెరికా వయాగ్రా డ్రగ్స్
author img

By

Published : Jul 31, 2021, 10:17 AM IST

భారత్​లో తయారైన 23 వేలకు పైగా సిల్డెనాఫిల్ సిట్రేట్ మాత్రలను అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వయాగ్రా ట్యాబ్లెట్ల తయారీలో ఈ డ్రగ్​నే ప్రధానంగా ఉపయోగిస్తారు. సీజ్ చేసిన ట్యాబ్లెట్ల రిటైల్ విలువ రూ.5.30 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.

సుమారు 20 కేజీల బరువైన పిల్స్​ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని బ్లిస్టర్ ప్యాకింగ్ చేశారు. జార్జియా, డెకాటర్​లో ఉన్న ఓ అపార్ట్​మెంట్​కు డ్రగ్స్​ను తరలిస్తున్నారు. భారత్​లోని ఓ అపార్ట్​మెంట్ నివాసం నుంచి వీటిని పంపినట్లు గుర్తించారు.

ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్​ దిగుమతిపై అమెరికాలో ఆంక్షలు ఉన్నాయి. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలకు లోబడి వీటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: కరోనాతో పారా హుషార్.. టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.