శ్వాసమార్గం ద్వారా శరీరంలోకి వ్యాక్సిన్‌ను పంపే సరికొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనివల్ల ఊపిరితిత్తులకు, శ్వాస వ్యవస్థకు ఎలాంటి హాని ఉండదని వారు చెబుతున్నారు. ఇప్పటికే ఎలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని.. కొవిడ్-19 వంటి రుగ్మతల చికిత్సకూ ఈ విధానం అనువుగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు.
సాధారణంగా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత శరీరంలో ప్రతికూలతలు ఏర్పడటం సహజం. శరీరంలో జరిగే మార్పుల కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే.. శ్వాసమార్గం ద్వారా టీకా ఇవ్వడం వల్ల ఔషధ పనితీరు మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాక్సిన్ ప్రతికూలతలూ తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
"కొవిడ్, క్షయ, ఎబోలా, పొంగు తదితర వ్యాధి కారకాలను నిరోధించేందుకు శ్వాసమార్గం ద్వారా వ్యాక్సిన్, చికిత్స అందించడం మేలు. కానీ.. పరికరాలు లేనందున ఈ విధానం ప్రాచుర్యం పొందలేదు. ఈ పద్ధతిలో సులభ వ్యాక్సినేషన్ కోసం ఫేజ్ పార్టికల్స్‌ను రూపొందించాం. వీటి ద్వారా ప్రొటీన్‌ను ఇచ్చి చూశాం. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. వ్యాక్సిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది."
- వాదిహ్ అరాప్, రట్గర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు
ఇదీ చదవండి: టైమ్స్ 'హీరోస్ ఆఫ్ 2020'లో భారతీయ-అమెరికన్