ETV Bharat / international

చైనాకు సవాల్​: భారత్​కు అమెరికా బలగాలు!

ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు పొరుగు దేశాలతో దుస్సాహసాలకు పాల్పడుతోన్న చైనాకు దీటైన సమాధానం చెప్పేందుకు ప్రణాళిక రచిస్తోంది అమెరికా. ఇటీవలి కాలంలో భారత్​ సహా ఇతర దేశాలపై బెదిరింపులకు పాల్పడుతోన్న చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీని ఎదుర్కొనేందుకు ఆసియాలో తమ బలగాల మోహరింపుపై సమీక్షిస్తున్నట్లు తెలిపింది.​

author img

By

Published : Jun 26, 2020, 10:11 AM IST

Pompeo
చైనాను ఎదుర్కొనేందుకు భారత్​కు అమెరికా బలగాలు!

భారత్​- చైనా మధ్య ఇటీవల సరిహద్దు వివాదం చెలరేగినప్పటి నుంచి భారత్​కు మద్దతుగా నిలిచిన అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది. ఆసియాలోని పలు దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్న చైనా పీపుల్స్ లిబరేషన్​​ ఆర్మీ ముప్పును ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా తమ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నట్లు ప్రకటించింది.

ఇటీవల భారత్​ సహా మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్​ వంటి దేశాలపై చైనా దుశ్చర్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్​ పాంపియో. చైనాను ఎదుర్కోవటమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా తమ బలగాల మోహరింపుపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

జర్మన్​ మార్షల్​ ఫండ్​ ఆధ్వర్యంలో వర్చువల్​గా నిర్వహించిన బ్రసెల్స్​ ఫోరమ్​-2020 వేదికగా ఈ మేరకు చైనాకు హెచ్చరికలు పంపారు పాంపియో.

" చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీని ఎదుర్కోవటానికి ప్రపంచంలోని వివిధ దేశాల్లో మా బలగాల మోహరింపుపై సరైన స్థితిలో ఉన్నామని నిర్ధరించుకోబోతున్నాం. దానిని ఒక సవాలుగా భావిస్తున్నాం. అందుకు తగినన్ని వనరులను సిద్ధం చేస్తాం. నిర్ధిష్ట ప్రాంతాల్లో అమెరికా దళాలున్నాయి. ముఖ్యంగా భారత్​, వియాత్నాం, మలేషియా, ఇండోనేషియా, దక్షిణ చైనా సముద్రం, ఫిలిప్పీన్స్​ దేశాలకు చైనా కమ్యూనిస్ట్​ పార్టీ నుంచి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అది మన ముందు ఉన్న ప్రధాన సవాలుగా భావిస్తున్నాం. ఏ ప్రాంతానికైనా ముప్పు ఎదురైతే ఇతర దేశాలు బాధ్యత తీసుకుని వారిని రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా భాగస్వాములందరితో, ముఖ్యంగా ఐరోపాలోని మా స్నేహితులతో పూర్తి సంప్రదింపులు జరిపి బలగాల విస్తరణ చేయాలనుకుంటున్నాం."

- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

అంతర్జాతీయంగా బలగాల విస్తరణ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆదేశానుసారంగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్​ ఆదేశాలతో జర్మనీలోని 52 వేల బలగాలను 25 వేలకు తగ్గించాలని ఇటీవలే అమెరికా నిర్ణయించింది. దీనిపై విమర్శలు ఎదురైనా వాటిని ఖండించారు పాంపియో. ఆసియా దేశాల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకే జర్మనీలోని బలగాలను తగ్గిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: జీ-7 సదస్సు: భారత్‌కు ఆహ్వానం.. అయినా ఆచితూచి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.